Redmi Note 7S allegedly explodes; company says fire 'customer induced (Photo-Twitter)

Mumbai, Novemebr 22: చైనా మొబైల్స్ తయారీ దిగ్గజం షియోమీకి చెందిన రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లు పేలిన సంఘటనలు గతంలో ఎన్నో జరిగాయి. తాజాగా ఇలాంటిదే మరొక ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగింది. అయితే ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఫోన్ దగ్గర ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ముంబైలో నివాసం ఉండే ఈశ్వర్ చౌహాన్ గత అక్టోబర్ నెలలో ఫ్లిప్‌కార్ట్‌(Flipkart)లో షియోమీ రెడ్‌మీ నోట్ 7ఎస్ (Redmi Note 7S ) స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేశాడు.

అయితే నవంబర్ 2వ తేదీన అతని ఇంట్లో టేబుల్ మీద ఉంచిన‌ ఆ ఫోన్ దానంతట అదే అకస్మాత్తుగా పేలింది. ఈ క్రమంలో చౌహాన్ షియోమీ కస్టమర్ కేర్‌ను సంప్రదించగా వారు ఆ ఫోన్‌ను పరిశీలించి కస్టమర్ తప్పిదం వల్లే ఫోన్ పేలి ఉంటుందని చెప్పారు.

షియోమి ఇండియా రిప్లై

అయితే ఈశ్వర్ చౌహాన్ మాత్రం తాను ఫోన్‌ను టేబుల్ మీద పెట్టానని, అకస్మాత్తుగా అందులో నుంచి కాలిపోయిన వాసన వచ్చిందని, ఆ తరువాత వెంటనే పేలిందని(Redmi Note 7S explodes), తాను ఫోన్‌ను కింద పడేయలేదని, కనీసం దానికి చార్జింగ్ కూడా పెట్టలేదని తెలిపాడు.

ఫ్లిప్‌కార్ట్ రిప్లై

అయితే షియోమీ అతని వాదనను పట్టించుకోలేదు. కానీ.. పేలిన ఆ ఫోన్‌కు బదులుగా ఇంకొక ఫోన్‌ను షియోమీ అతనికి ఇచ్చిందా, లేదా అన్న విషయంపై మాత్రం స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే కస్టమర్ ట్విట్టర్లో ట్వీట్ చేసిన ట్వీట్ కనపడటం లేదు. దానికి షియోమి ఇండియా అలాగే ఫ్లిప్ కార్ట్ రిప్లై ఇచ్చాయి.