Samsung Galaxy XCover7 Smartphone: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ తన బ్రాండ్ నుంచి మొట్టమొదటిసారిగా తమ సంస్థకే ప్రత్యేకమైన రగ్గడ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 'శాంసంగ్ గెలాక్సీ ఎక్స్ కవర్ 7' పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్ ఎంతో దృఢమైనది, కఠినమైనది, ఎంతో మన్నికైనదని సంస్థ చెబుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ మిలిటరీ-గ్రేడ్ మన్నిక ప్రమాణాలకు కట్టుబడి ఉందని హామి ఇస్తోంది. అలాగే నీటి నిరోధకత, ధూళి నిరోధకత కోసం IP68 రేటింగ్ కలిగి ఉందని Samsung తెలిపింది. దీని డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ రక్షణతో వస్తుంది. అలాగే తమ Galaxy XCover7 తీవ్రమైన వాతావరణ పరిస్థితులను సైత తట్టుకునేలా రూపొందించబడిందని పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ లో నిక్షిప్తం చేసిన సాఫ్ట్‌వేర్, సున్నితమైన డేటాను రక్షించడానికి Samsung నాక్స్ వాల్ట్‌ను కలిగి ఉంది.
Samsung Galaxy XCover7 స్టాండర్డ్, ఎంటర్ప్రైజ్ అనే వేరియంట్లలో లభిస్తోంది. 6GB RAM, 128GB ఆన్-బోర్డ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందించబడుతుంది, స్టోరేజీని 1TB వరకు విస్తరించుకోవచ్చు. అనుకూలీకరించిన పనులను నిర్వహించడానికి స్మార్ట్‌ఫోన్ అదనపు ప్రోగ్రామబుల్ కీతో వస్తుంది. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఈ కింద తెలుసుకోండి.
Samsung Galaxy XCover7 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.6-అంగుళాల ఫుల్‌హెచ్‌డి+ TFT డిస్‌ప్లే
- 6GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్
- వెనకవైపు 50MPకెమెరా, ముందు భాగంలో 50MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
- 4050 mAh బ్యాటరీ సామర్థ్యం (రిమూవెబుల్)
- ధరలు: స్టాండర్డ్ ఎడిషన్: రూ. 27,208/-
ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్: రూ. 27,530/-
కనెక్టివిటీ కోసం USB టైప్-C 2.0, POGO 8 పిన్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, 5G, LTE, Wi-Fi 5, Wi-Fi డైరెక్ట్, బ్లూటూత్ v5.3, NFC
సెన్సార్లు: యాక్సిలెరోమీటర్, జియోమాగ్నెటిక్, గైరో, లైట్ మొదలైనవి అందిస్తున్నారు.
ఆసక్తిగల కొనుగోలుదారులు శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేయవచ్చు.