Tik Tok Smartphone:  ఇండియాలో సెన్సేషనల్ వీడియో షేరింగ్ యాప్ 'టిక్ టాక్' ఓనర్ నుంచి స్మార్టిసాన్ జియాంగ్వో ప్రో 3 అనే స్మార్ట్‌ఫోన్‌ విడుదల, ధర మరియు ఇతర విశేషాలు ఇలా ఉన్నాయి
Visual of Smartisan Jianguo Pro 3 phone | (Photo Credits: Twitter/utsavtechie)

Beijing: టిక్ టాక్ (Tik Tok), హెలో (Helo) లాంటి వీడియో షేరింగ్ యాప్స్‌తో ఇండియాలో సూపర్ పాపులర్ అయిన చైనీస్ టెక్ దిగ్గజం 'బైట్‌డాన్స్' (Byte Dance) సంస్థ తన సొంత స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లోకి విడుదల చేసింది. స్మార్టిసాన్ జియాంగ్వో ప్రో 3 (Smartisan Jianguo Pro 3 Smartphone) లేదా నట్ ప్రో3 (Nut Pro 3) పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌ మూడు వేరియంట్లలో లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో కూడా విడుదల చేసే అవకాశం ఉంది, అయితే భారత్‌తో సహా ఇతర దేశాలకు ఎప్పుడు ఎగుమతి చేయగలదు అనే విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు.

ర్యామ్ మరియు ఇంటర్నల్ స్టోరేజ్ ఆధారంగా 3 వేరియంట్లలో లభ్యమయ్యే స్మార్టిసన్ జియాంగ్వో ప్రో 3 ఫోన్, అందుకు తగినట్లుగానే ధరలు ఉండనున్నాయి.  ప్రైమరీ మోడెల్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 2,899/- (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 29,000), 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ - ధర CNY 3,199 (రూ. 32,000) అలాగే ప్రీమియర్ వెర్షన్‌లో 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 3,599 (సుమారు రూ .36,000) వద్ద విక్రయిస్తున్నారు. ఫోన్ యొక్క మొదటి రెండు వెర్షన్లు నలుపు మరియు తెలుపు రంగులలో లభిస్తాయి. ఇక డిస్‌ప్లే లో చూపించబడిన ప్రీమియర్ వెర్షన్ ప్రత్యేకంగా గ్రీన్-ఇష్ మాట్సుటేక్ రంగులో మాత్రమే అందిస్తున్నారు.  రూ.699కే జియో ఫోన్ ఆఫర్ మరో నెల రోజులు పొడిగింపు

ఇక టెక్నికల్ విషయాలకు వస్తే.. ఫోన్ యొక్క అన్ని వెర్షన్లు డ్యూయల్ నానో సిమ్ ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. గాడ్జెట్ యొక్క స్క్రీన్ పరిమాణం 6.39-అంగుళాలు, పూర్తి HD నాణ్యతతో కాంట్రాస్ట్ రేషియో 100,000: 1, కాంట్రాస్ట్ రేషియో మరియు పిక్సెల్ డెన్సిటీ 403 పిపిఐ. బ్యాటరీ పరిమాణం 4,000 mAh, వేగంగా ఛార్జ్ అయ్యే విధంగా క్విక్ ఛార్జ్ 4+ (18W) ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ లేదా USB సి-టైప్ ఛార్జర్ సదుపాయం కలిగి ఉంది. ఈ ఫోన్ శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 855+ SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది. అండ్రాయిడ్ ఆధారితంగా ఈ ఫోన్‌ పనిచేస్తుంది, అయితే అండ్రాయిడ్ వివరాలపై స్పష్టత లేదు 'స్మార్టిసాన్ ఓఎస్ 7' తో ఈ ఫోన్ పనిచేయబడుతుందని కంపెనీ పేర్కొంది.

ఫోన్ వెనుక ఐదు స్నాపర్‌లను కలిగి ఉంది, ఇందులో 48 మెగాపిక్సెల్ గల సోనీ IMX 586 సెన్సార్‌ కెమెరా ప్రధానమైనది. 20 మెగాపిక్సెల్స్ తో సెల్ఫీ కెమెరా అందిస్తున్నారు.

ఇక చివరగా చెప్పుకోవాల్సింది, ఈ ఫోన్‌లోని లాక్ స్క్రీన్ స్వైప్ చేయగానే నేరుగా ఇన్ బిల్ట్ 'టిక్ టాక్' యాప్ ఓపెన్ అవుతుంది, సింగిల్ స్వైప్ తో యాప్ క్లోజ్ చేయవచ్చు. ఇక మిగతా ఫీచర్లన్నీ దాదాపు ప్రతీ స్మార్ట్‌ఫోన్‌లో ఉండేవే. భారత్ సహా ఇతర దేశాల్లో ఈ నట్ ప్రో3 స్మార్ట్‌ఫోన్‌ను సొంత చేసుకోవాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.