Tecno Spark 20 Smartphone: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ 'ట్రాన్షన్ టెక్నో' తమ స్పార్క్ సిరీస్ లోని మరొక మోడల్ టెక్నో స్పార్క్ 20ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎన్నో మెరుగైన ఫీచర్లు ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ధరలోనే లభించనుంది. నాణ్యమైన బ్యాటరీ, స్టోరేజ్ ఎక్కువగా కోరుకునే వారికోసం ఈ ఫోన్ మంచి ఎంపిక అవుతుంది.
అంతేకాదు రూ. 10 వేల బడ్జెట్లోనే లభిస్తున్న ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి ఏడాది పాటు రూ. 5604 విలువైన OTT సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది. ఇందులో భాగంగా వినియోగదారులు SonyLIV, Zee5, Fancode, Lionsgate Play, Shemaroo సహా మొత్తం 23 కంటే ఎక్కువ OTT ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ ఉచితంగా ఆస్వాదించవచ్చు.
ఈ ఫోన్ మీకు నియాన్ గోల్డ్, గ్రావిటీ బ్లాక్, సైబర్ వైట్, మ్యాజిక్ స్కిన్ బ్లూ వంటి నాలుగు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. కొత్త Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్‌లో ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఈ కింద తెలుసుకోండి.
Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.6 అంగుళాల LCD HD+ డిస్‌ప్లే
- 8GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్
- వెనకవైపు 50MP+ AI డ్యూయల్ కెమెరా, ముందు భాగంలో 32 MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఛార్జర్
- ధర రూ. 10,499/-
కనెక్టివిటీ కోసం డ్యూయల్ సిమ్ స్లాట్, 4G, Wi-Fi, బ్లూటూత్ 5.2, USB టైప్-C పోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందిస్తున్నారు.
ఆసక్తిగల కొనుగోలుదారులు Amazonతో పాటు కొన్ని ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. విక్రయాలు ఫిబ్రవరి 2, 2024 నుండి ప్రారంభమవుతాయి.