Vivo V30 series unveiled: Pic twitter

Vivo V30 Series Smartphone: స్మార్ట్‌ఫోన్‌ మేకర్ వివో తమ బ్రాండ్ నుంచి V20 సిరీస్ కు తర్వాతి తరంగా V30 సిరీస్ ను అధికారికంగా ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల మార్కెట్లో ఈ సరికొత్త Vivo V30 స్మార్ట్‌ఫోన్‌ సిరీస్ ను అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. త్వరలోనే భారతీయ మార్కెట్లో కూడా Vivo V30 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నారు. ఎన్నో అత్యాధునిక ఫీచర్లతో, విభిన్న హంగులతో Vivo V30ని ప్రవేశపెడుతున్నారు. ఇందులో భాగంగా 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్‌, శక్తివంతమైన Qualcomm యొక్క స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 SoC, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉన్నటువంటి ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. అయితే ఈ ఫోన్ Vivo S18కు రీబ్రాండెడ్ వెర్షన్ గా కనిపిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

స్టోరేజ్ ఆధారంగా ఈ హ్యాండ్ సెట్ నాలుగు  వేరియంట్‌లలో లభ్యం కానుంది. ఇంటర్నల్ స్టోరేజ్ కనిష్టంగా 128GB నుంచి గరిష్టంగా  512GB వరకు వివిధ కాన్ఫిగరేషన్లలో అందిస్తున్నారు.  Vivo V30 స్మార్ట్‌ఫోన్‌ బ్లూమ్ వైట్, వేవింగ్ ఆక్వా రిప్లింగ్, లష్ గ్రీన్, నోబుల్ బ్లాక్ ఫ్లోరైట్ అనే  నాలుగు ఆకర్షణీయమైన రంగులలో అందిస్తున్నారు. ప్రతీ రంగు మోడల్ ఫోన్  ప్రత్యేకమైన ఫినిషింగ్ తో లభిస్తుంది.  బ్లూమ్ వైట్ మోడల్ 3D పెటల్ ప్యాటర్న్‌ను ప్రదర్శిస్తుంది, వేవింగ్ ఆక్వా రిప్లింగ్ కలర్ ఫోన్ మాగ్నెటిక్ పార్టికల్ ఎఫెక్ట్‌తో మంత్రముగ్దులను చేస్తుంది, మరొకటి రంగు మార్చే  గ్రీన్ మెటామార్ఫోసెస్, నాల్గవది నోబుల్ బ్లాక్ ఫ్లోరైట్ AGlass తో అధునాతనతను వెదజల్లుతుంది.

ఇంకా వివో వి30 స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఈ కింద తెలుసుకోండి.

Vivo V30 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 1260x 2800 (FHD+) రిజల్యూషన్
  • 8GB/16GB RAM, 128/512 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP+ 50MP+2MP ట్రిపుల్ కెమెరా, ముందు భాగంలో 50MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 80W ఛార్జర్

కనెక్టివిటీలో భాగంగా 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్, GPS, USB టైప్-C , NFC ఉన్నాయి. అయితే ఈ ఫోన్ మార్కెట్లోకి ఈ ఫిబ్రవరి నెలలోనే రానుంది, తేదీ ఎప్పుడు అనేది తెలియాల్సి ఉంది. ధరలపై నిర్ణయం తీసుకున్నాక కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచుతారు.