Vivo Y200e 5G Smartphone: స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో తన Y సిరీస్ పోర్ట్‌ఫోలియో క్రింద మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. Y200e 5G పేరుతో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ మిడ్ -రేంజ్ సెగ్మెంట్ లో ఉంటుంది. మన్నికైన ఎకో-ఫైబర్ లెదర్ మరియు పేటెంట్ యాంటీ-స్టెయిన్ కోటింగ్‌తో వచ్చిన భారతదేశపు మొట్టమొదటి వివో ఫోన్ ఇది. Y200e 5Gలో శక్తివంతమైన చిప్ సెట్, నాణ్యమైన బ్యాటరీ బ్యాకప్, మంచి కెమెరా ఫీచర్లను అందిస్తున్నారు. కంపెనీ ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ ఇండోర్ లైటింగ్ పరిస్థితుల్లో షూటింగ్ కోసం ఫ్లికర్ సెన్సార్‌తో వస్తుంది.
ర్యామ్ ఆధారంగా Vivo Y200e 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అలాగే సాఫ్రాన్ డిలైట్ మరియు బ్లాక్ డైమండ్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఈ కింద తెలుసుకోండి.
Vivo Y200e 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.67 అంగుళాల పూర్తి-HD+ AMOLED డిస్‌ప్లే
- 6GB/8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం, మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు
- క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్
- వెనకవైపు 50MP+2MP+సెన్సార్ ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 44W ఫాస్ట్ ఛార్జింగ్
అదనంగా ఈ ఫోన్ 5G, 4G, GPS, Wi-Fi, బ్లూటూత్ 5.0 మరియు USB టైప్-సి కనెక్టివిటీని కూడా సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండాఇది డస్ట్, స్ల్పాష్ రెసిస్టెన్స్ కోసం IP54 రేటింగ్ కలిగి ఉంది. భద్రత కోసం ఇన్- డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది.
భారత మార్కెట్లో Vivo Y200e 5G ధర 6GB + 128GB వేరియంట్ కోసం రూ. 19,999/-
8GB + 128GB వేరియంట్ ధర రూ. 20,999/-
HDFC మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ హోల్డర్లకు రూ. 1000 డిస్కౌంట్ లభించనుంది. ఈ తగ్గింపు ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 29 వరకు బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం వివో ఇండియా వెబ్‌సైట్‌లో ఈ Vivo Y200e 5G ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. ఈ ఫోన్ విక్రయ తేదీని కంపెనీ ఇంకా ధృవీకరించనప్పటికీ, మార్చి 1 నుండి విక్రయించబడుతుందని Flipkart జాబితా సూచిస్తుంది.