Redmi A3 Smartphone: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ 'షావోమి' తాజాగా తమ 'రెడ్‌మి A సిరీస్' లో మరొక ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. Redmi A3 పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్, గతంలో లాంచ్ చేసిన రెడ్‌మి A2 స్మార్ట్‌ఫోన్‌కు అప్‌డేటెడ్ వెర్షన్ అని చెప్పవచ్చు. ఈ సరికొత్త Redmi A3 స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ధరలోనే లభించే హ్యాండ్‌సెట్ అయినప్పటికీ, దీని డిజైన్ చూస్తే ఇదొక ప్రీమియం రేంజ్ స్మార్ట్‌ఫోన్ అని అనిపిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనకవైపు గుండ్రని కెమెరా సెటప్ కలిగి, సరికొత్త 'హాలో' డిజైన్‌తో వస్తుంది. దీని ప్యానెల్ గ్లాసీ, లెదర్ ఫినిషింగ్ కలిగి ఉన్నాయి.
Redmi A3 మిడ్నైట్ బ్లాక్, లేక్ బ్లూ మరియు ఆలివ్ గ్రీన్ అనే మూడు ఆకర్షణీయమైన రంగులలో లభ్యం అవుతుంది. అలాగే ర్యామ్, స్టోరేజ్ ఆధారంగా మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
కొత్త Xiaomi Redmi A3 స్మార్ట్‌ఫోన్‌లో ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఈ కింద తెలుసుకోండి.
Redmi A3 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.71 అంగుళాల LCD HD+ డిస్‌ప్లే
- 3 GB/4 GB/6 GB RAM, 64 GB/128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో G36 ప్రాసెసర్
- వెనకవైపు 8MP+ AI డ్యూయల్ కెమెరా, ముందు భాగంలో 5MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఛార్జర్
కనెక్టివిటీ కోసం, డ్యూయల్ సిమ్ స్లాట్, 4G VoLTE, Wi-Fi 802.11 b/g/n, బ్లూటూత్ 5.0, GPS + GLONASS, USB టైప్- C పోర్ట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
Redmi A3 ధరలు.. రూ. 3GB + 64GB మోడల్ కోసం 7,299/-
4GB + 128GB మోడల్ ధర రూ. 8,299/- మరియు టాప్-ఎండ్ 6GB + 128GB మోడల్ ధర రూ. 9,299/-
ఆసక్తిగల కొనుగోలుదారులు Flipkart, Mi.com, Mi Home స్టోర్లతో పాటు అన్ని ప్రముఖ రిటైల్ స్టోల ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఫిబ్రవరి 23, 2024 నుండి విక్రయాలు ప్రారంభమవుతాయి.