స్విట్జర్లాండ్ లో ఓ 20 ఏండ్ల యువకుడు హస్త ప్రయోగం చేసుకుంటుండగా.. అతని ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. దీంతో అతను (20-year-old Swiss man) ఆస్పత్రి పాలయ్యాడు. ప్రస్తుతం అతను ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని రేడియాలజీ కేస్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురించారు. అందులో పొందుపరిచిన కథనం ప్రకారం.. స్విట్జర్లాండ్‌కు చెందిన యువకుడు(20) ఇంట్లోనే బెడ్‌పై పడుకుని హస్త ప్రయోగం (masturbating) చేసుకుంటున్నాడు. ఈ సమయంలో అతనికి ఛాతీలో తీవ్రమైన నొప్పి ( hospitalised after tearing his lung) వచ్చింది. శ్వాస తీసుకోవడంలో సమస్యలు సంభవించాయి. దీంతో హుటాహుటిన బాధిత యువకుడు ఆస్పత్రికి వెళ్లాడు.
వైద్యులు అతన్ని పరీక్షించగా.. అప్పటికే అతని ముఖం వాచిపోయింది. శ్వాస తీసుకున్నప్పుడల్లా ఊపిరితిత్తుల్లో శబ్దాలు రావడాన్ని గమనించారు. ఎక్స్ రే తీయగా న్యుమోమెడియాస్టినమ్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే తరుచుగా హస్త ప్రయోగం చేయడం వల్ల.. ఆ ప్రభావం ఊపిరితిత్తులపై పడినట్లు వైద్యులు పేర్కొన్నారు. గాలి గట్టిగా తీసుకోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైందని డాక్టర్లు తెలిపారు. దీనివల్ల ఊపిరితిత్తుల్లో నుంచి గాలి లీక్ కావడం వల్ల, బలంగా శ్వాస తీసుకున్నప్పుడల్లా శబ్దాలు వస్తున్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీనికి తోడు బాధిత యువకుడికి ఆస్తమా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
ఊపిరితిత్తులు దెబ్బతిన్న కారణంగా బాధితుడికి హైడోస్ ఆక్సిజన్ అందించారు. ఛాతీ నొప్పికి యాంటీబయోటిక్స్ ఇచ్చినట్లు డాక్టర్లు తెలిపారు. నాలుగు రోజుల అనంతరం ఆ యువకుడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. 20 ఏండ్ల వయసు ఉన్న యువకులు హస్త ప్రయోగం చేసే సమయంలో చాలా అరుదుగా ఇలాంటి సమస్య తలెత్తుందని వైద్యులు చెప్పారు.