Fire Accident in Jaipur (Credits: X)

Jaipur, Dec 20: రాజస్థాన్‌ (Rajasthan) లోని జైపూర్‌ లో (Jaipur) ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. శుక్రవారం ఉదయం అజ్మీర్‌ రోడ్డులో ఉన్న ఓ పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆగి ఉన్న ఓ సీఎన్‌ జీ ట్యాంకర్‌ ను మరో ట్రక్‌ వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్‌ లో మంటలు చెలరేగడంతో అది ఒక్కసారిగా పేలిపోయింది. పక్కనే ఉన్న వాహనాలకు మంటలు వ్యాపించడంతో వాహనాలు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. మరో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

బాయ్ ఫ్రెండ్ తో కాదు.. గర్ల్‌ ఫ్రెండ్‌ తో వెళ్లిపోయిన భార్య.. కోర్టుకెక్కిన భర్త.. అసలేం జరిగింది?? ఎక్కడ జరిగింది??

Here's Video:

22 ఫైర్‌ ఇంజిన్ల సాయంతో..

ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. 22 ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్‌ కు తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది.

అవమానం వల్లే అశ్విన్ వీడ్కోలు.. తండ్రి సంచలన ఆరోపణలు.. దిద్దుబాటుకు దిగిన స్పిన్నర్‌ (వీడియో)