NewDelhi, October 3: మనం చిన్నప్పుడు జాతరల్లో, ఎగ్జిబిషన్లలో చూసిన రోప్ వాకింగ్ (Rope Walking) సాధారణమే. కొందరైతే మరీ ప్రొఫెషనల్ గా (Professional) అత్యంత ఎత్తులో, పెద్ద పెద్ద భవనాలకు తాళ్లు కట్టి వాటి మీద నడుస్తుంటారు. ఇక అక్కడక్కడా నిప్పుల గుండం మీద నడక వంటివీ మామూలే. ఈ రెండింటినీ కలిపి.. అత్యంత భయానకమైన ఫీట్ చేస్తే.. అది అగ్నిపర్వతం (Volcano) మీద రోప్ వాకింగ్. వామ్మో అనిపిస్తుంది కదా. ఇద్దరు ధైర్య వంతులు ఈ ఫీట్ (Feet)ను చేసి చూపించి గిన్నిస్ రికార్డులకు (Guinness Records) ఎక్కారు. బ్రెజిల్ కు చెందిన రాఫెల్ బ్రీడీ, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ షూల్జ్ ఈ రోప్ వాకింగ్ చేశారు.
టాన్నా ద్వీపంలో ఉన్న అగ్ని పర్వతంపై 846 అడుగుల పొడవున, 137 అడుగుల ఎత్తులో ఈ ఫీట్ ను సాధించారు. ఓ వైపు లావా ఎగసి పడుతుండగానే.. వారు రోప్ వాకింగ్ చేసిన వీడియో ఒళ్లు గగుర్పొడిచేలా ఉండటం గమనార్హం. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ఈ వీడియోను తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి పెద్ద సంఖ్యలో వ్యూస్ నమోదవుతున్నాయి.
do. not. look. down. 😳🌋 pic.twitter.com/2mn8xuCUQK
— #GWR2023 OUT NOW (@GWR) September 21, 2022