దేశీయ టెలికం దిగ్గజ ఆపరేటర్ ‘భారతీ ఎయిర్‌టెల్’ తమ వినియోగదారుల కోసం మరో నూతన ప్లాన్‌ను ఆవిష్కరించింది. 45 రోజుల వ్యాలిడిటీతో రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. మొత్తం 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, మొత్తం 600 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. మొత్తంగా చూస్తే ఈ ప్లాన్‌పై యూజర్ రోజుకు కేవలం రూ.6.2 మాత్రమే వెచ్చిస్తారు. అయితే డేటా పరిమితంగా ఉంటుంది. 2జీబీ కంటే ఎక్కువ డేటా కావాలనుకుంటే రోజుకి రూ.19తో ‘యాడ్ ఆన్ డేటా’ వోచర్‌లను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక ఈ ప్లాన్‌లో భాగంగా అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలో ట్యూన్‌లు, వింక్ మ్యూజిక్ వంటి ఎయిర్‌టెల్ అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. ఎక్కువ డేటా అవసరం లేకుండా.. తక్కువ ఖర్చుతో సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచాలనుకునే యూజర్లకు ఈ ప్లాన్ అనుకూలం. అపరిమిత వాయిస్ కాలింగ్ అందిస్తుండడం ఈ ప్లాన్‌లో చాలా విలువైన జోడింపుగా ఉంది. దేశ వ్యాప్తంగా జియో సేవలు డౌన్, ఎక్స్ వేదికగా గగ్గోలు పెడుతున్న వినియోగదారులు
ఎయిర్‌టెల్ కంపెనీ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లలో ఈ రీఛార్జ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ తక్కువ ధరకు ఎక్కువ కాలం వ్యాలిడిటీని అందిస్తున్న ఆఫర్‌గా ఉంది. కాగా ఇటీవలే ఎయిర్‌టెల్ 70 రోజుల వ్యాలిడిటీతో రూ.395 ప్లాన్‌ను ప్రకటించింది. వ్యాలిడిటీ ఎక్కువగానే ఉన్నప్పటికీ ఈ ప్లాన్ కింద కూడా డేటా పరిమితంగానే ఉంది. డేటా ఎక్కువగా వాడేవారికి ఈ ప్లాన్లు అంత ఆకర్షణీయంగా కనిపించకపోవచ్చు.