Newyork, Nov 29: అమెరికాకు (America) చెందిన హవాయి దీవి (Hawaii Island) లోని మవోనా లోవా (Mauna Loa) అగ్నిపర్వతం (Volcano) నుంచి భారీ స్థాయిలో బూడిద, ఇతర శకలాలు వెలువడుతున్నాయి. కాల్డెరా పర్వత శిఖరాగ్రంపై ఉన్న మవోనా లోవా ప్రపంచంలో క్రియాశీలకంగా ఉన్న అతిపెద్ద అగ్నిపర్వతం. ఇప్పుడది బద్దలవుతోంది. మరికొన్నిరోజుల్లో ఇది పూర్తిస్థాయిలో లావా (Lava) వెదజల్లనుందని అధికారులు హెచ్చరించారు. దీని ప్రభావంతో సమీప ప్రాంతాలు బూడిదమయం అయ్యాయి. హవాయి ద్వీపంలోని చాలా భాగానికి బూడిద హెచ్చరికలు జారీ అయ్యాయి. 0.6 సెం.మీ మందంతో బూడిద పేరుకుంటుందని జాతీయ వాతావరణ సంస్థ వెల్లడించింది.
మంకీపాక్స్ కు కొత్తపేరు పెట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ‘ఎంపాక్స్’గా పేరు మార్పు.. ఎందుకో తెలుసా?
అటు, శాస్త్రవేత్తలు కూడా అప్రమత్తం అయ్యారు. ఇటీవల భూకంపాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో, మవోనా లోవా నుంచి వస్తున్న సంకేతాలను తేలిగ్గా తీసుకోరాదని అంటున్నారు. హవాయి దీవిలో ఉన్న ఐదు అగ్నిపర్వతాల్లో మవోనా లోవా ఒకటి. ఇది చివరిసారిగా 1984లో బద్దలైంది.