
Bengaluru, Sep 24: కర్ణాటక రాజధాని బెంగళూరులో (Bengaluru) ట్రాఫిక్ కష్టాలు (Traffic Problems) తారాస్థాయికి చేరుకున్నాయి. 2-3 కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పడుతోంది. తాజాగా జరిగిన రెండు ఘటనలు బెంగళూరు ట్రాఫిక్ సమస్యకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ట్రాఫిక్ లో చిక్కుకున్న ఓ మహిళ కూరగాయలను ఒలుచుకుంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ ట్రాఫిక్ లో వంట కూడా చేసుకోవచ్చని పలువురు నెటిజన్లు వ్యంగ్యంగా పేర్కొన్నారు.
షాపింగ్‌కు వెళ్లేంత సమయం..
బెంగళూరు ట్రాఫిక్ లో చిక్కుకొన్న దీపాంశుకు ఆయనేదో షాపింగ్‌కు వెళ్లినట్టు ‘మీ షాపింగ్ అనుభవం ఎలా ఉంది?’ అంటూ గూగుల్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఆయన గంటల తరబడి ఓ షాపింగ్ మాల్ పక్కన ట్రాఫిక్ లో చిక్కుకుపోవడమే అందుకు కారణం.