Srinagar, October 11: అనంతనాగ్ జిల్లాలో సోమవారం ఆర్మీ బలగాలకు , ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో (Encounter) ఆర్మీకి చెందిన జూమ్ (Zoom) అనే పేరుగల జాగిలం (Army Dog) తీవ్రంగా గాయపడింది. ఉగ్రవాదులు స్థావరంగా ఉన్న ఒక ఇంటి లోకి బలగాలు సోమవారం తమ జాగిలాన్ని పంపారు. ఆర్మీ శిక్షణ పొందిన ఈ జాగిలం జూమ్ చాలా క్రూరమైనది. ఉగ్రవాదుల జాడ పసికట్టడంలో దిట్ట. ఉగ్రవాదుల ఇంటి లోకి చొరబడగానే రెండు తుపాకీ తూటాలు తగిలి తీవ్రంగా గాయపడింది. అయినా ఆ జాగిలం అంతటితో ఆగక, ఉగ్రవాదులను ఎదిరించింది.
జూమ్ తన టాస్క్ కచ్చితంగా నెరవేర్చడం వల్లనే ఉగ్రవాదులను తాము మట్టుపెట్టగలిగామని అధికారులు తెలిపారు. గాయపడిన జూమ్‌ను వెంటనే ఆర్మీ వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. జూమ్ త్వరగా కోలుకోవాలని ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేసింది.
We wish Army assault dog 'Zoom' a speedy recovery. #Kashmir@adgpi@NorthernComd_IA pic.twitter.com/i1zJl0C2Gw
— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) October 10, 2022