Assam: తన భార్య 25 మందితో లేచిపోయినా కాపురం చేస్తున్న ఓ ఉత్తమ భర్త, పిల్లల కోసం అన్నీ ఓర్చుకుంటున్నానని తెలిపిన మ‌ఫీజుద్దీన్, అస్సాంలో వైరల్ ఘటన
Representational Image (Photo Credits: File Image)

Guwahat, Sep 11: అసోం రాష్ట్రం నాగోన్ జిల్లా ధింగ్ లాహ్‌క‌ర్ గ్రామానికి చెందిన ఓ మ‌హిళ ఒక‌రి త‌ర్వాత ఒక‌రితో మొత్తం 25 మందితో వివాహేత‌ర సంబంధాలు (Assam Woman Elopes 25 Times) పెట్టుకుని, 25 సార్లు లేచిపోయి వ‌చ్చింది. అయినప్పటికీ ఆ భర్త ఆమెను ఏమి అనలేదు. కాపురలంలో ఎలాంటి కలతలు (Husband Still Willing To Accept Her) రాలేదు. భ‌ర్త కొట్ట‌లేదు తిట్ట‌లేదు. ఆమె ప్రియుల‌తో పిక్నిక్‌ల‌కు వెళ్లిన‌ట్లు వెళ్లి రావ‌డం, రాగానే భ‌ర్త అక్కున చేర్చుకోవ‌డం జ‌రుగుతున్న‌ది.

ఈ వైరల్ ఘటన వివ‌రాల్లోకి వెళ్తే.. ధింగ్ లాహ్‌క‌ర్ గ్రామానికి చెందిన ఓ 40 ఏండ్ల మ‌హిళ‌కు ప‌దేండ్ల క్రితం వృత్తిరీత్యా డ్రైవ‌ర్ అయిన‌ మ‌ఫీజుద్దీన్ అనే వ్య‌క్తితో వివాహం జ‌రిగింది. అయితే, ఈ పదేండ్ల కాలంలో ఆ మ‌హిళ ఏనాడు భ‌ర్త‌తో స‌రిగా కాపురం చేయ‌లేదు. ప‌దేండ్లలో ఒక‌టి కాదు, రెండు కాదు ఏకంగా 25 మందితో 25 సార్లు లేచిపోయి తిరిగొచ్చింది. అయినా భ‌ర్త‌ మ‌ఫీజుద్దీన్ గానీ, అత‌ని కుటుంబ‌స‌భ్యులుగానీ ఏనాడూ ఆమెను ప‌ల్లెత్తి మాట అన‌లేదు. భార్య అన్నిసార్లు లేచిపోయి వ‌చ్చినా ఎందుకు క‌లిసి కాపురం చేస్తున్నావ‌ని మ‌ఫీజుద్దీన్‌ను అడిగితే.. త‌న పిల్ల‌ల కోసం అని చెబుతున్నాడు.

మహిళా కానిస్టేబుల్‌తో డీఎస్పీ రాసలీలలు, వైరల్ అవుతున్న హీరాలాల్ సైనీ, మహిళా కానిస్టేబుల్ స్విమ్మింగ్ పూల్ వీడియో, చర్యలకు ఉపక్రమించిన ఉన్నతాధికారులు

ఆ దంప‌తుల‌కు ఆరేండ్ల వ‌య‌సున్న కుమార్తె, మూడేండ్లు, మూడు నెల‌ల వ‌య‌సున్న ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. భార్య‌ను కాపురానికి రానీయ‌క‌పోతే పిల్ల‌ల‌ను ఎవ‌రు చూసుకుంటార‌ని మ‌ఫీజుద్దీన్ ప్ర‌శ్నిస్తున్నాడు. పసి పిల్ల‌ల‌ను వ‌దిలేసి రేయిప‌గ‌లు తేడా లేకుండా చేసే డ్రైవ‌ర్ విధులు ఎలా నిర్వ‌ర్తించ‌గ‌ల‌న‌ని అడుగుతున్నాడు. ఇప్పుడు కూడా త‌న భార్య త‌న‌తో లేద‌ని, కొద్ది రోజుల క్రితం మేక‌ల‌కు మేత తీసుకొస్తాన‌ని చెప్పి మూడు నెల‌ల బాబును ప‌క్కింటి వాళ్లకు ఇచ్చి వెళ్లింద‌ని, ఇక ఆమె ఎప్పుడు వ‌స్తుందో తెలియ‌ద‌ని మ‌ఫీజుద్దీన్ చెప్పాడు. కొన్ని కొన్నిసార్లు రోజుల వ్య‌వ‌ధిలో తిరిగొచ్చింద‌ని, కొన్ని సార్లు మాత్రం నెల‌ల కొద్ది పోయింద‌ని తెలిపాడు. ఈసారి పోతూపోతూ ఇంట్లో ఉన్న రూ.22 వేలు ఎత్తికెళ్లింద‌ని వాపోయాడు.