Ayodhya, Jan 8: అయోధ్యలో (Ayodhya) జనవరి 22న జరగనున్న శ్రీ రామ మందిర (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి వడివడిగా ఏర్పాట్లు జరగుతున్నాయి. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అనేక మందిని ఆహ్వానించింది. నాలుగు వేల మంది సాధువులు, 2,200 మంది ఇతర అతిథులకు ట్రస్టు ఆహ్వాన పత్రికలు పంపింది. ఆహ్వానాలు అందుకున్న వారిలో పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సీనీక్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు.
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధానిగా ఐదోసారి ఎన్నికైన షేక్ హసీనా.. ఎన్నికల సంఘం వెల్లడి
Actors Ranbir Kapoor and Alia Bhatt received an invitation to attend the consecration ceremony of Ram Temple on January 22nd in Ayodhya. pic.twitter.com/UfiBDZO99z
— AIBS News 24 (@AIBSNews24) January 8, 2024
రాజకీయ నాయకులు-సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, డాక్టర్ మన్మోహన్ సింగ్, అధిర్ రంజన్ చౌదరి, లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, హెచ్ డీ దేవెగౌడ తదితరులు
నటీనటులు-అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, అక్షయ్ కుమార్, రజనీకాంత్, అనుపమ్ ఖేర్, సంజయ్‌లీలా భన్సాలీ, అలియా భట్, రణబీర్ కపూర్, సన్నీ డియోల్, అజయ్ దేవ్‌గన్, చిరంజీవి, మోహన్ లాల్, ధనుష్, రిషభ్ శెట్టి, ప్రభాస్, టైగర్ ష్రాఫ్, ఆయుష్మాన్ ఖురానా తదితరులు
వ్యాపారవేత్తలు-రతన్ టాటా, ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీ, గౌతమ్ అదానీ
క్రీడాకారులు-సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ