Bengaluru, June 19: బిజీ లైఫ్ (Busy Life) కారణంగా ఆన్ లైన్ షాపింగ్ (Online Shopping) ఈమధ్య పెరిగిపోయింది. అయితే, ఇచ్చిన వస్తువు ప్లేస్ లో ఇంకో వస్తువు వచ్చిన ఘటనలు ఇప్పటికే చాలా చూశాం. అయితే, ఇప్పుడు మీరు ఈ వార్త చదివాక ఆన్ లైన్ లో ఆర్డర్ చేయాలంటే భయపడే పరిస్థితి ఏర్పడొచ్చు. విషయంలోకి వెళ్తే.. బెంగళూర్ కు చెందిన దంపతులు ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ లో ఎక్స్ బాక్స్ కంట్రోలర్ ఆర్డర్ చేశారు. మంగళవారం డెలివరీ వచ్చింది. తప్పుడు ఆర్డర్లు వస్తున్నాయన్న అనుమానంతో ఎందుకైనా మంచిదని ఆర్డర్ తీసే సమయంలో వీడియో తీశారు. బాక్స్ ను ఓపెన్ చెయ్యగానే దాని టేప్ కు అతుక్కున్న పామును గుర్తించారు. దీంతో ఒక్కసారిగా షాక్ తిని భయపడ్డారు.
అమెజాన్ కొరియర్లో వచ్చిన విషపూరిత పాము
కర్ణాటక - సర్జాపూర్ పట్టణంలో ఒక వ్యక్తి ఎక్స్బాక్స్ కంట్రోలర్ని ఆర్డర్ పెట్టగా.. అందులో విషపూరితమైన పాము వచ్చింది.
ఆ పాము కొరియర్కి వేసిన టేప్తో అతుక్కుని చిక్కుకుపోవడంతో పెను ప్రమాదం తప్పింది. pic.twitter.com/nJQtwiw6fS
— Telugu Scribe (@TeluguScribe) June 18, 2024
టేపు కు అతుక్కోవడంతో
నాగు పాము టేపుకు అతుక్కొని ఉండటంతో అది బయటకు రాలేకపోయింది. దీంతో ఆ జంట ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే పరిస్థితి మరోలా ఉండేదని వాపోయారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటనపై స్పందించిన అమెజాన్ డెలివరీ సొమ్మును రీఫండ్ చేసి చేతులు దులుపుకున్నట్టు సదరు దంపతులు వాపోయారు.