రాజస్థాన్ లోని బికనీర్ ప్రాంతంలో విధుల్లో ఉన్న ఓ బీఎస్ఎఫ్ జవాన్.. అక్కడి ఎండల వేడి తీవ్రతను చూపేందుకు ఇసుకపై పాపడాలు వేయించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మనం వేయించుకుని తినే మసాలా పాపడాలను (అప్పడాలను) జవాన్ అక్కడి ఇసుకపై పెట్టాడు. దానిపై పక్కనే ఉన్న కొంత ఇసుక వేశాడు. జస్ట్ కొన్ని సెకన్లలోనే పాపడా వేయించినట్టుగా గట్టిపడిపోయింది. ఎండ వేడికి ఇసుకలో వేగిన పాపడాను సదరు జవాన్ విరిచి చూపించాడు. తర్వాత మరో పాపడాను జస్ట్ అలా ఇసుకపై వేసి ఉంచాడు. అది కూడా కాసేపటికి వేగినట్టుగా కనపడడం గమనార్హం. పీటీఐ ఈ వీడియోను తమ ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది.  పెరియార్ నదిలో వందలాది చేపలు మృత్యువాత, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చే కాలుష్యమే కారణమంటున్న స్థానికులు, వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)