ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ మధ్య ఓ వార్త బాగా వైరల్ అయింది. మందుబాబులు ఎంతో ఇష్టంగా సేవించే బీరులో మూత్రం కూడా కలుస్తోందన్న వార్తలు (Budweiser Employee Peeing In Beer) విపరీతంగా వైరల్ అయ్యాయి. బడ్వైజర్ బీర్ కంపెనీలో (Budweiser Company) పనిచేసే ఓ ఉద్యోగి 12 ఏళ్లుగా బీర్ ట్యాంకులో తాను మూత్రం పోస్తున్నట్లు వెల్లడించారన్నది ఆ వార్తా కథనం సారాంశం. ఆ ఉద్యోగి తన పేరును వాల్టెర్ పావెలగా వెళ్లడించాడు. తమ ప్లాంట్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోని బడ్వైజర్ బీర్ ప్లాంట్స్‌లో పనిచేసే ఉద్యోగులు ( Budweiser employees) కూడా...తాము ఎప్పుడు యూరిన్ పోవాలనుకుంటే అప్పుడు బీర్ ట్యాంకులో పోసేందుకు అనుమతులు ఉంటాయంటూ చెప్పుకొచ్చాడు.
పూర్తి వివరాల్లోకెళితే.. ప్రపంచ ప్రఖ్యాత బడ్ వైజర్ బ్రాండ్ కు అమెరికాలోని కొలరాడోలో పెద్ద ప్లాంట్ ఉంది. ఆ దేశానికి కావాల్సిన బీరులో అధిక శాతం ఆ ప్లాంటు నుంచే ఉత్పత్తి అవుతోంది. అయితే, అక్కడ పనిచేస్తోన్న ఉద్యోగి ఒకరు.. తాను గత 12 ఏళ్లుగా ఫ్యాక్టరీలోని బీర్ ట్యాంకులో మూత్రం పోస్తున్నట్లు అంగీకరించడం కలకలం రేపింది. తన అసలు పేరును బయటపెట్టకుండా బీరు ఫ్యాక్టరీలో చోటుచేసుకున్న ఘటనల్ని వివరిస్తూ ఆ ఉద్యోగి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన దగ్గర ఎవరైనా బడ్వైజర్ బీర్ బాగుంటుందని అంటే...వారిని చూసి తనకు జాలేస్తుందని పేర్కొన్నాడు. ఎంత దారుణమైన చర్య, కోతిని ఉరితీస్తూ సంబరాలు జరుపుకున్న కొందరు గ్రామస్థులు, తెలంగాణలో ఖమ్మం జిల్లాలో అమానవీయ సంఘటన
వాట్సప్ గ్రూప్స్‌లో ఈ వార్తా కథనం చక్కర్లు కొట్టడంతో మద్యం ప్రియులు పరేషాన్ అయ్యారు. తాము ఎంతో ఇష్టపడే బీర్‌ను ఇక ఎలా తాగాలంటూ బిక్కమొహంపెట్టారు. అయితే ఈ వైరల్ కథనంపై జరిగిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ కథనాన్ని ప్రచురించిన వెబ్‌సైట్ సెటైరికల్స్ కథనాలను ప్రచురిస్తుంటుందని తేలింది. ఇందులో పలు అవాస్తవ కథనాలు (Budweiser ‘Piss’ Fact Check) ప్రచురించగా...బడ్వైజర్ బీర్ కంపెనీ ఉద్యోగి బీర్ ప్లాంట్‌లో 12 సంవత్సరాలుగా మూత్రం పోస్తున్నట్లు పేర్కొన్నట్లు ప్రచురించిన కథనం కూడా అవాస్తవమేనని తేలింది. ఈ కథనం చివర్లో ఇది ఫేక్ న్యూస్‌గా ఆ వెబ్‌సైట్ పేర్కొనడం విశేషం.
బీరు ట్యాంకులో 12 ఏళ్లుగా మూత్రం పోస్తున్నానని అంగీకరించిన తర్వాత కూడా సదరు ఉద్యోగిని కంపెనీ తొలగించలేకపోయిందని, అసలు పేరు బయటపెట్టకపోవడం ద్వారా అతను శిక్ష నుంచి తప్పించుకున్నాడని వార్తలు వచ్చాయి. ఫోర్ట్ కొలిన్స్ లోని బడ్ వైజర్ ప్లాంటులో సుమారు 800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అదీగాక అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించే కంపెనీలో ఓ ఉద్యోగి ఇంత సులభంగా.. అది కూడా 12 ఏళ్లపాటు ట్యాంకులో మూత్రం పోయడం సాధ్యమేనా? అనే అనుమానాలూ వ్యక్తమయ్యాయి.
చివరికి ఫ్యాక్ట్ ఫైండర్లు కొందరు ఇది ఫేక్ న్యూస్ అని తేల్చారు. ఫూలిష్ హ్యూమర్ డాట్ కామ్ అనే వెబ్ సైట్ సరదాగా క్రియేట్ చేసిన ఈ వార్త అంతటా కలకలం రేపింది. తమ కంపెనీ పేరు మీద ఇంత పెద్ద దుమారం చెలరేగడాన్ని బడ్ వైజర్ సంస్థ లైట్ తీసుకుంది. కాగా ఆర్టికల్ చివర్లోని డిస్కైమర్‌ను చదవకుండానే...ఈ వార్త నిజమని ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు నెటిజన్స్. ‘ఈ వెబ్‌సైట్‌ను వినోదం, హాస్యం పంచేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులోని కథనాలు ఊహాజనితమైన, అవాస్తవదూరమైనవి’ అంటూ అందులో పేర్కొన్నారు.