Fishes playing on the railway track: ముంబై మహా నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం కురిసిన వర్షానికే నగరంలో రోడ్లన్నీ నదుల్ని తలపిస్తున్నాయి. ఇక మంగళవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (ఐఎండి) అంచనా వేసింది. దీంతో ముంబైకి ఐఎండి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఐఎండి హెచ్చరికలు మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. ముంబై, థానే, నవీ బుంబై, పన్వెల్, పూణెతోపాటు రత్నగిరి-సింధుదుర్గ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు అధికారులు మంగళవారం సెలవు ప్రకటించారు. అలాగే వర్షం కారణంగా ముంబై యూనివర్సిటీలో ఈరోజు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదాపడ్డాయి. ముంబై నగరాన్ని ఒక్కసారిగా ముంచెత్తిన భారీ వర్షం, హోర్డింగ్ కూలి ముగ్గురు మృతి, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన షిండే, వీడియోలు ఇవిగో..
కాగా, ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజామున వరకు ముంబైలో భారీ వర్షం కురిసింది. ఏడు గంటల వ్యవధిలోనే సుమారు 300 మిల్లీమీటర్లకుపైనే వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ఎన్నో అవస్థలు పడ్డారు. బైకులు, కార్లు పలు వాహనాలు నీటిపై తేలియాడాయి. ముంబైలో కురిసిన భారీ వర్షాలకు రైలు పట్టాల మీద చేపలు జలకాలాడాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
Here's Videos
Indian Railways ❌ Indian Waterways ✅
Heavy Rainfall Effect in Mumbai, Marine species on a tour to unexplored location 😂 #IndianRailways pic.twitter.com/q0yaqup0ZQ
— Trains of India (@trainwalebhaiya) July 9, 2024
ముంబైలో కురిసిన భారీ వర్షాలకు రైలు పట్టాల మీద తిరుగుతున్న చేపలు pic.twitter.com/6QE5GA6PTz
— Telugu Scribe (@TeluguScribe) July 10, 2024