Newdelhi, May 14: దేశవ్యాప్తంగా ఇప్పటికే వందలాది ఓటీటీలు (OTT) అందుబాటులో ఉన్నాయి. అయితే, అందులో ప్రసారమవుతున్న కంటెంట్ పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ కేంద్రం కీలక విషయం వెల్లడించింది. ఓ క్లీన్ ఓటీటీ ప్లాట్ ఫాంను తీసుకొస్తున్నట్టు వివరించింది. ప్రసారభారతి (PrasaraBharathi) ఆధ్వర్యంలో పనిచేసే ఈ ప్లాట్ ఫాం లోని కంటెంట్ ప్రధానంగా భారతీయ సమాజం, సంస్కృతీ సంప్రదాయాలను లక్ష్యంగా చేసుకుని ఉంటుంది. ఇందులో ప్రసారం చేసే కంటెంట్ ను కుటుంబం మొత్తం కలిసి వీక్షించేలా తీర్చిదిద్దనున్నారు. వినోదంతో పాటు కరెంట్ అఫైర్స్ ను కూడా ఇందులో కవర్ చేయనున్నట్టు సమాచారం.
Centre to launch its own OTT platform, to air ‘clean’ content promoting ‘India’s culture, values’
Moushumi Das Gupta @dgupta_moushumi reports for ThePrinthttps://t.co/X63Wh2x6ck
— ThePrintIndia (@ThePrintIndia) May 13, 2024
తొలిదఫాలో ఫ్రీ
కేంద్రం తీసుకురానున్న ఈ ఓటీటీ ద్వారా తొలి రెండు సంవత్సరాలు ఉచితంగా సేవలు అందించి, ఆ తర్వాత ధరలు నిర్ణయించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.