Beijing, DEC 25: చైనాలో కరోనా వైరస్ (Corona Virus) మరోసారి విజృంభిస్తోంది. బీఎఫ్-7 వేరియంట్ (BF.7 Variant) ఆ దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రజలకు వేగంగా వ్యాపిస్తుంది. చైనా రాజధానితో పాటు పలు నగరాల్లో ఆస్పత్రుల్లో రద్దీ భారీగా పెరిగింది. నివేదికల ప్రకారం.. చైనాలో (China Corona) దాదాపు 37 మిలియన్ల మంది ప్రజలు ఈ వారంలో కరోనా భారిన పడినట్లు తెలుస్తోంది. వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. దీంతో చైనాలోని పలు ప్రాంతాల ప్రజలు బయటకు రావాలంటే వణికిపోతున్నారు. చైనాలో రోజురోజుకు కరోనా వ్యాప్తి పెరుగుతున్న వేళ.. వినూత్న రీతిలో కరోనా నుంచి రక్షించుకునేందుకు ఆ దేశ ప్రజలు పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ జంట మార్కెట్‌లో కూరగాయలు కొనేందుకు ప్లాస్లిక్ కవర్లో వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా (Viral Video) మారింది.
कोरोना संक्रमण से बचने के लिये चीन में इस तरह के उपाय अपनाए जा रहे हैं?pic.twitter.com/MGB5jVapX8
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) December 25, 2022
దంపంతులు కిరాణా సామాన్లు కొనుగోలు కోసం మార్కెట్‌కు వచ్చారు. అయితే, వారు పొడవాటి ప్లాస్టిక్ షీట్‌ను (protective plastic sheet around) గొడుగువలే చేసుకున్నారు. దానిని పైభాగం నుంచి కింది వరకు ఏర్పాటు చేసుకొని దానిలో ఇద్దరు కలిసి మార్కెట్ కు వచ్చారు. కవర్లోనే ఉండి కావాల్సిన సరుకులను కట్టించుకున్నారు. ఆ తరువాత వాటిని కింది భాగంనుంచి తీసుకున్నారు. అయితే, ఈ జంట వినూత్న చర్యను చూసి స్థానికులు ఎవరూ ఆశ్చర్యపోయినట్లు కనిపించలేదు. ఎందుకంటే.. ప్రస్తుతం చైనాలో కరోనా నుంచి రక్షణ పొందేందుకు పలు వినూత్న పద్దతులను స్థానికులు పాటిస్తున్నారు.
ఇదిలాఉంటే.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాల వ్యాఖ్యలను చేస్తున్నారు. కూరగాయలకు కరోనా అంటుకుంటే పరిస్థితి ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ జంట ప్రయత్నం బాగున్నా.. కరోనా రాకుండా ఈ విధానం పూర్తిగా రక్షణ ఇచ్చేదిలాలేదని కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను నెటిజన్లు వ్యక్తపరుస్తున్నారు.