Newdelhi, Oct 6: పండుగల వేళ బస్సులు (Buses), రైల్వే స్టేషన్లు (Railway Stations) రద్దీగా కూరగాయల మార్కెట్ ను తలపించేలా ఉంటాయి. అయితే, ఎయిర్ పోర్టులు కూడా అలా ఉంటాయంటే నమ్ముతారా? అయితే, శనివారం దేశ వ్యాప్తంగా పలు ఎయిర్ పోర్టులలో ఇదే సీన్ కనిపించింది. ఇండిగో (IndiGo) విమాన ప్రయాణికులు శనివారం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సర్వర్లలో ఏర్పడిన భారీ సాంకేతిక లోపం కారణంగా దేశ వ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులకు అటంకం కలిగింది. వెబ్ సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ కాలేదు. టిక్కెట్లు తీసుకున్న వారు గంటల కొద్దీ చెక్ ఇన్ ల కోసం వేచి చూడాల్సి వచ్చింది.
ఇండిగో సేవలకు తీవ్ర అంతరాయం తలెత్తడంతో రైల్వే స్టేషన్లల మారిన ఎయిర్ పోర్ట్లు pic.twitter.com/gsdl0cYvUr
— Telugu Scribe (@TeluguScribe) October 6, 2024
సంస్థ ఏమ్మన్నదంటే?
శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సమస్య ఏర్పడగా, ఒంటి గంటకు దానిని పునరుద్ధరించామని సంస్థ ప్రకటించింది. అయితే, పలుసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తాయని, ఇప్పటికీ కొనసాగుతున్నాయని ప్రయాణికులు చెప్తున్నారు.