Newdelhi, Apr 6: భర్త తప్పు లేకున్నా భార్య మాటిమాటికీ పుట్టింటికి (matrimonial home) వెళ్లిపోతున్నట్లయితే అతడిని మానసికంగా హింసించినట్లేనని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) స్పష్టం చేసింది. దాన్ని క్రూరత్వ చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. సంయమనం కోల్పోయిన దంపతుల మధ్య ఎడబాటు పెరుగుతూపోతే వారు ఎన్నటికీ కలవలేనంతగా పరిస్థితి మారిపోతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు విడివిడిగా ఉంటున్న దంపతులకు విడాకులు (Divorce) మంజూరు చేస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
Delhi HC grants man divorce over wife repeatedly leaving matrimonial home
(reports @Shrutikakk)https://t.co/5U5d3RZfVh pic.twitter.com/oBIoioCrrG
— Hindustan Times (@htTweets) April 5, 2024
19 ఏళ్ల వైవాహిక జీవితంలో దాదాపు ఏడు సార్లు భార్య తనను వీడి వెళ్లిపోయిందని ఓ భర్త కోర్టుకు వెల్లడించారు. అలా వెళ్లిన ప్రతిసారీ పది నెలల పాటు పుట్టింటిలో ఉందనీ అన్నారు. కుటుంబ న్యాయస్థానం ఈ జంటకు విడాకులు ఇవ్వడానికి నిరాకరించగా భర్త హైకోర్టును ఆశ్రయించడంతో భార్య చర్యను తప్పుబట్టిన హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.