Delhi Horror: ఢిల్లీలో దారుణం, కూతురు పుట్టిందని పాలు ఇస్తూ పసికందు గొంతు నొక్కి చంపేసిన కసాయి తల్లి, అనంతరం పాప కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కసాయి తల్లి ఆరో రోజుల కిందట పుట్టిన నవజాత శిశువుకు పాలు ఇస్తున్న సందర్భంగా గొంతు నొక్కి (Woman Strangles Newborn To Death While Feeding) చంపింది.అనంతరం తన బిడ్డ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
New Delhi, Sep 2: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కసాయి తల్లి ఆరో రోజుల కిందట పుట్టిన నవజాత శిశువుకు పాలు ఇస్తున్న సందర్భంగా గొంతు నొక్కి (Woman Strangles Newborn To Death While Feeding) చంపింది.అనంతరం తన బిడ్డ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ ఢిల్లీలోని ఖ్యాలా పోలీస్ స్టేషన్‌కు శుక్రవారం తెల్లవారుజామున ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆరు రోజుల బిడ్డ కనిపించడం లేదని 28 ఏళ్ల శివాని ఫిర్యాదు చేసింది. గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యిన తర్వాత తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లినట్లు ఆమె తెలిపింది. గత రాత్రి బిడ్డకు పాలిచ్చి పడుకోబెట్టానని, నిద్ర లేచి చూసేసరికి పక్కన పాప లేదని ఆందోళన వ్యక్తం చేసింది.
పోలీసులు వెంటనే ఆ ఇంటికి చేరుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే కుట్లు తీయడానికి ఆసుపత్రికి వెళ్లాలని పోలీసులతో చెప్పడంతో తల్లిపై పోలీసులకు అనుమానం వచ్చింది. వైద్య పరిస్థితి నేపథ్యంలో ఆమెను అడ్డుకోలేదు. అదృశ్యమైన పసిపాప కోసం పోలీసులు వెతికారు. ఎదురింటి రూఫ్‌పై ఒక బ్యాగ్ కనిపించింది. దానిని తెరిచి చూడగా పసిపాప అందులో కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్‌లో దారుణం, అర్థరాత్రి రూ. 2 వేలు ఇవ్వాలంటూ టీ మాస్టర్‌ని దారుణంగా కొట్టిన యువకుడు
బిడ్డ తల్లి ప్రవర్తనపై అనుమానించిన పోలీసులు ఆమెను ప్రశ్నించారు. దీంతో బోరున ఏడ్చిన శివాని, కూతుర్ని తానే చంపినట్లు చెప్పింది. ఈ బిడ్డ నాల్గవ ఆడపిల్ల అని, కాన్పు తర్వాత ఇద్దరు ఆడ పిల్లలు మరణించినట్లు ఆమె తెలిపింది. నాలుగో కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టడంతో సమాజం నుంచి హేళన భరించలేక హత్య చేసినట్లు పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత తగిన చర్యలు చేపడతామని పోలీస్ అధికారి వెల్లడించారు.
(The above story first appeared on LatestLY on Sep 02, 2024 08:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

