
Newdelhi, June 15: తాగిన మత్తులో ఉన్న ఓ సైనికుడు (Drunk Soldier Pees) రైలులో (Train) ప్రయాణిస్తూ తన బెర్త్ పై మూత్ర విసర్జన చేశాడు. ఆ మూత్రం తన బెర్త్ పై పడిందని ఓ మహిళ ఆరోపించింది. హజ్రత్ నిజాముద్దీన్ నుంచి చత్తీస్ గఢ్ లోని దుర్గ్ వెళ్తున్న గోండ్వానా ఎక్స్ ప్రెస్ రైలులో జరిగిందీ ఘటన. రైలు గ్వాలియర్ చేరుకుంటుందనగా ఈ ఘటన జరిగినట్టు సదరు మహిళ పేర్కొన్నారు. ఈ విషయమై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)కు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోలేదని మహిళ ఆరోపించారు. దీంతో ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.
ఖండించిన ఆర్ఫీఎఫ్ అధికారులు
మహిళ ఆరోపణలను ఆర్ఫీఎఫ్ అధికారులు ఖండించారు. మహిళ ఫిర్యాదుపై తాము వెంటనే స్పందించామని, బాధిత మహిళ తన సీట్లో కనిపించలేదని పేర్కొన్నారు. సైనికుడు మాత్రం పూర్తిగా తాగిన మత్తులో నిద్రపోతున్నాడని తెలిపారు.