Jail for Non Voters: ఓటు హక్కు ఉన్నప్పటికీ ఓటు వేయట్లేదా? అయితే, మీకు రేషన్ కట్, జైలుకు వెళ్లాల్సిందే, జరిమానా కూడా చెల్లించాల్సిందే! ఎక్కడంటే?
Jailer (Credits: X)

Vijayawada, May 13: ఏపీ (AP) అసెంబ్లీ, లోక్ సభ, (Assembly, Loksabha) తెలంగాణ ఎంపీ స్థానాలకు కాసేపటి క్రితం పోలింగ్ ప్రారంభమైంది. ఓటింగ్ శాతం పెంచడానికి ఇప్పటికే ఈసీ పలు కీలక చర్యలు చేపట్టింది. ఓటు హక్కు ఉన్నప్పటికీ ఓటేయకుంటే మన దేశంలో పెద్దగా శిక్షలు అమలు చెయ్యట్లేదు. అయితే, బయటి దేశాల్లో అలా కాదు. ఓటు వేయకపోతే, రేషన్ కట్ చేస్తారు. జైలులో వేస్తారు. భారీ జరిమానా కూడా విధిస్తారు. ఆయా దేశాలేంటో ఒకసారి చూద్దాం..

2024 భారతదేశం ఎన్నికలు: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఓట్ల జాతర.. పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటరు మహాశయులు.. ఓటు హక్కును వినియోగించుకున్న ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, నటులు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇతరత్రా ప్రముఖులు

పెరూ: ఈ దేశంలో ఓటేసిన వారికి స్టాంప్‌ వేసిన కార్డు ఇస్తారు. ఆ కార్డు చూపితేనే ప్రభుత్వం నుంచి రేషన్‌ సరుకులు, సేవలు అందుతాయి. లేకుంటే రేషన్‌ లేనట్టే. దీనితోపాటు ఓటేయకుంటే జరిమానా కూడా విధిస్తారు.

సింగపూర్‌: ఓటేయనివారి పేర్లను వెంటనే ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు. అలాంటి వారు ఏ ఎన్నికల్లో కూడా పోటీ పడటానికి చాన్స్‌ లేకుండా పోతుంది.

బెల్జియం: వరుసగా నాలుగు ఎన్నికల్లో ఓటేయకపోతే.. జైలుకు వెళ్లక తప్పదు.

అర్జెంటీనా: ఓటు వేయనివారు ఎందుకు వేయలేదనే కారణంతో ప్రభుత్వానికి వివరణ ఇవ్వాల్సిందే. లేకుంటే ఫైన్‌.

ఉత్తర కొరియా: ఓటేయకుంటే దేశ ద్రోహంగా పరిగణించి శిక్షలు విధిస్తారు.

బ్రెజిల్‌: జరిమానా కట్టాల్సి వస్తుంది.

HC on Wife Racial Remarks on Husband: భర్త న‌ల్ల‌గా ఉన్నాడ‌ని భార్య వేధించ‌డం క్రూర‌త్వ‌మే, కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు, దంపతులకు విడాకులు మంజూరు