Woman Finds Piece of Human Finger Inside Ice Cream Cone Ordered Online in Malad, Case Registered Against Yummo Ice Cream Company

Pune, June 17: ఆన్‌ లైన్‌ లో ఆర్డర్‌ చేసిన కోన్‌ ఐస్‌ క్రీమ్‌ లో మనిషి బొటవేలు (Human Finger) వచ్చిన ఘటన యావత్తు దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఈ ఘటనకు కారణమైన పుణేకు చెందిన సంబంధిత ఐస్‌ క్రీమ్‌ తయారీదారు కంపెనీ లైసెన్సును ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (FSSAI) సస్పెండ్ చేసింది. అదేవిధంగా ఆ కంపెనీని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులు తనిఖీ చేశారు. అక్కడ నమూనాలను సేకరించారు. అయితే, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇంకా రాలేదని సమాచారం.

బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్ రైలును ఢీకొన్న కాంచన్ జంగ ఎక్స్‌ ప్రెస్‌.. గాల్లోకి లేచిన బోగీ.. పలువురి మృతి!

కాగా ఇటీవల ముంబై లో ఈ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఆన్‌ లైన్‌ లో ఐస్‌ క్రీం కోన్‌ ఆర్డర్ చేయగా.. దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో మనిషి వేలు ఉంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా సదరు బాధితురాలు షేర్ చేశారు.