Power-Supply

Newdelhi, July 19: ఇంట్లో నాలుగు లైట్లు ఎక్కువ వేస్తేనే, కరెంట్ బిల్లు (Power Bill) తడిసిమోపెడవుతుంది. అలాంటిది దేశం మొత్తం ఎంత కరెంట్ వినియోగంలో (Electricity Consumption) ఉంటుందో, దానికి ఎంత బిల్లు అవుతుందో ఊహించగలమా? అయితే, టెక్‌ దిగ్గజాలు గూగుల్‌ (Google), మైక్రోసాఫ్ట్‌ (Microsoft) విద్యుత్తు వినియోగం ఒక రేంజుకు చేరింది. 2023లో ఈ రెండు కంపెనీలు 24 టెరావాట్‌ అవర్‌ విద్యుత్తును వినియోగించాయని తేలింది. ఈ వినియోగం ఎంతలా ఉందంటే.. దాదాపు 100కు పైగా దేశాలను మించి ఈ కంపెనీలు విద్యుత్తు వినియోగిస్తున్నట్టు లెక్క. ఆ రెండు కంపెనీలు మొత్తం 48 టెరావాట్‌ అవర్‌ విద్యుత్తును వాడుతున్నాయని పలువురు చెబుతున్నారు. కంపెనీల ఆదాయంలో ఎక్కువ మొత్తం ఈ బిల్లుల చెల్లింపులకే వెళ్తున్నట్టు వివరిస్తున్నారు.

వృద్ధాప్యానికి బైబై.. ఆయుష్షు పెంచే కొత్త ఔషధం.. 25 శాతం పెరిగిన ఎలుకల జీవితకాలం.. మరి మనుషుల్లో..?

ఎందుకు ఇంత వినియోగం?

డాటా సెంటర్లు, ఏఐ, క్లౌడ్‌ సర్వీసెస్‌ కార్యకలాపాలకు ఈ రెండు కంపెనీలు ఇంత మొత్తంలో విద్యుత్తును వినియోగిస్తున్నట్టు తేలింది. ఈ ప్రక్రియతో పెద్ద మొత్తంలో కార్బన్‌ డయాక్సైడ్‌ విడుదలవుతున్నదని, ఇది పర్యావరణానికి హానిని కలిగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి.

కరెన్సీ నోట్లను చించేసిన పిల్లలపై తండ్రి కోపం.. అల్లరి మాన్పించే ప్రయత్నంలో వింత నిర్ణయం.. ఉరేసుకుంటానని హెచ్చరిక.. పొరపాటున ఉరి బిగుసుకుని మృతి.. విశాఖలో వెలుగు చూసిన ఘటన