Kota, Feb 14: పెళ్లి చేసుకొనే సమయానికి మెచ్చిన యువతికి చిన్న ప్రమాదం (Aciident). దీంతో సరిగ్గా వివాహ సమయానికే హాస్పిటల్ (Hospital) పాలైంది. అయితే, వరుడు వెనక్కి తగ్గలేదు. హాస్పిటల్ లోనే వివాహ (Marriage) తంతు పూర్తి చేశాడు. ఈ సంఘటన రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రం కోటా జిల్లాలో (Kota) జరిగింది.
నూతన సచివాలయ భవన ప్రారంభోత్సవానికి మరో ముహూర్తం ఖరారు.. అంబేద్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14న ప్రారంభం!
భావ్‌పూర్ గ్రామానికి చెందిన పంకజ్‌కు రావత్‌భటా గ్రామానికి చెందిన మధు రాఠోడ్‌తో పెళ్లి నిశ్చయం కావడంతో అందరూ పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. పెళ్లి జరిగే రోజు వధువు జారిపడడంతో రెండు చేతులు విరిగిపోయాయి. ఆమె తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇదే సమయంలో పెళ్లి కుమారుడు ఊరేగింపుగా తన పెళ్లి మండపానికి చేరుకుంటుండగా ఈ వార్త తెలిసింది. వెంటనే ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకొని ఆస్పత్రిలోనే పెళ్లి చేశారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.
Marriage in Kota Hospital : कोटा में अनूठा मामला, अस्पताल में भर्ती दुल्हन से शादी रचाने बारात लेकर पहुंचा दूल्हाhttps://t.co/lyQ9lxT8NA@RajCMO @ashokgehlot51
— ETVBharat Rajasthan (@ETVBharatRJ) February 12, 2023