Newdelhi, Oct 24: యూట్యూబ్ వీడియోలను (YouTube videos) లైక్ చేయడం ద్వారా భారీ మొత్తం ఆర్జించవచ్చని మభ్యపెట్టి పలువురి నుంచి రూ. 73 లక్షలు కాజేసిన ముఠా సభ్యుల్లో ఒకరైన 28 ఏండ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబ్, మోజ్ యాప్ ల పేరుతో ఈ గ్యాంగ్ ఆన్ లైన్ ఫ్రాడ్ కు (Online Fraud) తెరలేపింది. నిందితుడు హరియాణాకు చెందిన సోనేపట్ వాసి అజయ్ కుమార్ ను గురుగ్రాంలో అరెస్ట్ చేశారు.
Gurgaon man promises quick cash in return of liking YouTube videos, steals Rs 73 lakhs from victims https://t.co/DMKJzveD6T
— IndiaTodayTech (@IndiaTodayTech) October 23, 2023
స్కాం ఇలా..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమార్ గురుగ్రామ్ కు చెందిన ఓ వ్యక్తికి వాట్సాప్ ద్వారా లింక్ పంపాడు. యూట్యూబ్ కంటెంట్ ను లైక్ చేయడం ద్వారా పెద్దమొత్తంలో ఆర్జించవచ్చని నమ్మబలికాడు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయాలని మభ్యపెట్టాడు. ఆపై కుమార్ పలుమార్లు ఇన్వెస్ట్ చేస్తూ పెద్దమొత్తంలో నష్టపోయాడు. ఇలా మరికొందరినీ మోసం చేసి పెద్దమొత్తంలో బురిడీ కొట్టించాడు. ఈ కేసులో ఇతర నిందితుల బ్యాంకు ఖాతాలకూ డబ్బు చేరవేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Mexico Horror: పోలీసు కాన్వాయ్ పై బుల్లెట్ల వర్షం.. 13 మంది పోలీసులు సహా మొత్తం 17 మంది మృతి