Virus | Representational Image | (Photo Credits: Pexels)

భారత్‌లో హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) కేసులు ఆందోళన కలించేంలా ఉన్నాయి. ఇప్పటికే కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు వైరస్‌ పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ లో మరో కేసు బయటపడింది. అక్కడ రెండు నెలల చిన్నారికి HMPV వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆ పసికందు అహ్మదాబాద్‌ (Ahmedabad)లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. శిశువు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బాధిత కుటుంబానికి రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌గా తెలిసింది. తాజా కేసుతో భారత్‌లో మొత్తం హెచ్‌ఎమ్‌పీవీ కేసుల సంఖ్య మూడుకు చేరింది.

భారత్‌లో ఇద్దరు చిన్నారులకు సోకిన హెచ్ఎంపీవీ వైరస్,అధికారికంగా ధృవీకరించిన ఐసీఎంఆర్, బెంగళూరులోనే ఈ రెండు కేసులు నమోదు

భారత్‌లో మొదటి రెండు కేసులూ కర్ణాటక రాజధాని బెంగళూరులోనే వెలుగు చూసినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ICMR) ధృవీకరించింది. బెంగళూరులోని బాప్టిస్ట్‌ ఆసుపత్రి (Baptist hospital)లో మూడు నెలల చిన్నారి, ఎనిమిది నెలల పాకు ఈ వైరస్‌ సోకిటనట్లు తేలింది. మూడు నెలల శిశువు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ కాగా, ఎనిమిది నెలల పాప ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది. బాధిత కుటుంబ సభ్యులకు అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన హిస్టరీ లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది.