Python Attacks Zookeeper: భయంకరమైన వీడియో, ఫైథాన్ దాడి నుంచి రెప్పపాటులో తప్పించుకున్న యజమాని, ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న వీడియో, 9 లక్షలకు పైగా వ్యూస్
Huge Snake Attacks Zookeeper (Photo-screengrab/ jayprehistoricpets instagram)

పాములతో వ్యాపారం నిర్వహించడం ఎంత ప్రమాదకరమో ఈ వీడియో చూస్తే ఇట్టే తెలిసిపొతుంది. కాలిఫోర్నియాలో ఒక జూ నిర్వాహకుడిపై పెద్ద పాము దాడి చేసింది. అయితే ఆయన దాని దాడి (Huge Snake Attacks Zookeeper) నుంచి తృటిలో తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ (Video goes viral in Social Media) అయ్యింది. జే బ్రూవర్ అనే స్నేక్ వ్యాపారి ఈ వీడియోని తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.

ఆయన (Jay Brewer) పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. కాలిఫోర్నియాలోని సరీసృపాల జూ (California's Reptile Zoo) వ్యవస్థాపకుడు మిస్టర్ బ్రూవర్ పాములను పట్టుకోవడం, వాటితో వ్యవహరించడం వంటి వాటిల్లో సంవత్సరాల అనుభవం ఉంది. వాస్తవానికి, అతని ఇన్‌స్టాగ్రామ్‌ పాముల చిత్రాలు మరియు వీడియోలతో నిండి ఉన్నాయి, ఈ వీడియోలు భయానకంగా కనిపించే సరీసృపాలను ప్రాక్టీసుతో సులభంగా నిర్వహిస్తుందని చూపిస్తుంది. ఈ వీడియోల్లో చాలా వాటిలో, అతను చాలా పెద్ద పాముల మధ్యలో కూర్చొని చూడవచ్చు.

పెళ్లి అయిన మళ్లీ రోజే నగలతో వధువు జంప్, మరోచోట తెల్లారితే పెళ్లి..వధువు పరార్, ఇంకో చోట నువ్వు నాకు తెలుసు..వ్యభిచారం చేస్తావా అంటూ అసభ్యకర మెసేజ్‌లు

అయితే బ్రూవర్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఒక వీడియో ఒళ్లు జలదరింప జేస్తున్నది. ఒక పెద్ద పైథాన్ ఆయనపై దాడి (Python Attacks Zookeeper) చేయగా తృటిలో తప్పించుకున్నారు. క్లిప్‌లో, జూకీపర్ ఒక పెట్టెలో వంకరగా ఉన్న భారీ పైథాన్ పక్కన నిలబడి ఉన్నాడు. అతను ఆ పైథాన్ నుండి తన చూపును పక్కకు తిప్పే లోపలే అది అతనిని కాటు వేయడానికి ప్రయత్నించింది. అదృష్టవశాత్తూ, మిస్టర్ బ్రూవర్ దాని కాటు నుండి తప్పించుకున్నాడు.

Watch the video below:

 

View this post on Instagram

 

A post shared by Jay Brewer (@jayprehistoricpets)

‘వావ్! ఈ పాము ఎంత స్మార్ట్‌గా వ్యవహరించిందో చూడండి? నా దృష్టి దాని పైనుంచి పక్కకు మళ్లిన మరుక్షణమే ఎలా దాడి చేసిందో చూశారా’ అని అందులో బ్రూవర్‌ వ్యాఖ్యానించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. ఇప్పటికే 9 లక్షల మందికిపైగా దీనిని వీక్షించారు. వెయ్యి మందికిపైగా నెటిజన్లు కామెంట్లు చేశారు. ‘మీరు తృటిలో తప్పించుకున్నారు.. లేకపోతే మీ ముఖంపై పాము కాటు వేసేది’ అని కొందరు వ్యాఖ్యానించారు.