
Newdelhi, Mar 23: వయసు పెరుగుతున్నా పెండ్లి (Marriage) కాకపోవడంతో కర్ణాటకలోని (Karnataka) చిక్కమగళూర్ జిల్లా బ్యాడిగెరె గ్రామ అవివాహిత పురుషులు ఆందోళన చెందుతున్నారు. వీలైనంత త్వరగా తమకు మంచి అమ్మాయిని వెతికి పెట్టమని దేవుడికి మొర పెడుతున్నారు. గ్రామంలోని శ్రీ సిద్దేశ్వర ఆలయ హుండీలో సుగి జాత్రా ఉత్సవాల సందర్భంగా శుక్రవారం కోరికల చిట్టాను హుండీలో వేసి దేవుడా నీదే భారం అన్నారు! ఆలయంలోని అజ్జయ్య స్వామి, అన్నపూర్ణేశ్వరిలకు ప్రత్యేక పూజలు చేశారు. జాబితాలో 25-38 ఏండ్ల వయసు కలిగిన 30 మంది యువకుల పేర్లు ఉన్నాయి.
