Crime (Photo-File)

Hyderabad, July 15: రోడ్డు మీద (Road Accident) ఎన్ని ప్రమాదాలు జరిగినా.. మొబైల్ (Mobile) వ్యసనం కుటుంబాల్లో ఎంత విషాదాన్ని నింపుతున్నా యూత్ మాత్రం దాన్ని పట్టించుకోవట్లేదు. మొబైలే తమ జీవితం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. హైదరాబాద్ లోని మేడ్చల్ – పోచారం ఐటీ కారిడార్ వద్ద జరిగిన తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదం ఈ కోవలోకే వస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ – పోచారం ఐటీ కారిడార్ హైవే రోడ్డును గిరి అనే వ్యక్తి దాటాలని ప్రయత్నించాడు. అప్పటికే, రోడ్డు మీద వాహనాలు వేగంగా కదులుతున్నాయి.  ఇది చూసినప్పటికీ, అతను ఫోన్ లో మాట్లాడుతూనే రోడ్డు దాటడానికి ప్రయత్నించాడు.

ఉత్తరప్రదేశ్ లోని మథురలో ఐదేండ్ల పిల్లాడిపై దాడి చేసిన కోతులు.. కాపాడిన యువకులు (వైరల్ వీడియో)

10 మీటర్లు ఎత్తులో గాల్లో ఎగిరిపడిన గిరి

ఇంతలో ఓ కారు అతన్ని ఢీకొట్టింది. దీంతో 10 మీటర్లు ఎత్తులో గాల్లో ఎగిరిపడిన గిరి రోడ్డు మీద పడ్డాడు. డివైడర్ పక్కన నేలకు అతని తల గట్టిగా తాకడంతో మరణించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. దీన్ని చూసిన పలువురు నెటిజన్లు.. ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటడం అవసరమా? అని కామెంట్లు చేస్తున్నారు.

పంజాగుట్ట పీవీఆర్ సినిమా థియేటర్లో జలపాతం.. కంగుతిన్న వీక్షకులు.. ‘కల్కి’ సినిమా షో నిలిపివేత.. వైరల్ వీడియో