Akash Chopra (Photo Credits: Twitter)

NewDelhi, September 20: ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్ కు బీసీసీఐ జట్టును ఎంపిక చేసింది. జట్టు ఎంపికపై టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించారు. వివరాల్లోకి వెళ్తే... ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ కరోనా బారిన పడ్డాడు. అయితే షమీతో పాటు ఉమేశ్ యాదవ్ ను కూడా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ... ఉమేశ్ 2019 నుంచి ఇప్పటి వరకు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదని అన్నారు. ఇలాంటి వ్యక్తిని ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు.

యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్ల వీడియో, 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కొడుకుతో కలిసి ఆ వీడయోని వీక్షించిన యువీ

ఇక షమీ ప్రస్తుత సంవత్సరంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదని గుర్తుచేశారు. టీ20 ప్రపంచకప్ కు మరో నాలుగు వారాలు మాత్రమే మిగిలి ఉన్న ఈ సమయంలో వీరిద్దరినీ ఎలా ఎంపిక చేస్తారని చోప్రా ప్రశ్నించారు. వరల్డ్ కప్ కు బీసీసీఐ ప్లాన్స్ అన్నీ తలకిందులైనట్టుగా అనిపిస్తోందని అన్నారు. మరోవైపు ఇదే విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ... షమీ, ఉమేశ్ ఇద్దరూ ఎంతో అనుభవం ఉన్న ఆటగాళ్లని... వీరు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదని వ్యాఖ్యానించారు.