2007 టీ20 ప్రపంచకప్ లో ఇండియా-ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ లో యువరాజ్ సింగ్ సృష్టించిన విధ్వంసం అభిమానులకు ఎప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ బ్రాడ్‌ బౌలింగ్ లో ఆరు సిక్సర్లను బాది ఇంగ్లండ్ క్రికెట్లర్లకు చుక్కలు చూపించాడు. ఇది జరిగి నేటికి 15 ఏళ్ళు దాటింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో యువీ ఆరు సిక్సర్ల వీడియో ట్రెండ్ అవుతున్నది. ఆ మ్యాచ్‌లో యువరాజ్.. 12 బంతుల్లోనే అర్థ సెంచరీ చేశాడు. ఇందులో ఏడు సిక్సర్లు (42 పరుగులు వాటిద్వారే) ఉన్నాయి.

ఇప్పటికీ ఈ రికార్డు చెక్కు చెదరలేదు. ఈ వీడియోలో యువరాజ్ సిక్సర్ల వర్షంతో పాటు రవిశాస్త్రి కామెంటరీ కూడా అభిమానులును అలరిస్తుంది. తాజాగా యువీ కూడా తన కొడుకుతో కలిసి ఈ మ్యాచ్‌ను చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ఓ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)