Newdelhi, May 13: ఆచారం అనుకుంటాం కానీ, ఆరోగ్యం (Health) కోసం మన పూర్వీకులు చేసిన ప్రతీ పనిని శాస్త్ర, సాంకేతిక సంస్థలు నేడు ప్రశంసిస్తున్నాయి. ఇదీ అలాంటి ఘటనే. పూర్వీకులు చేసినట్టు మట్టి పాత్రల్లో (Mud Pots) వంట చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) తెలిపింది. మట్టి పాత్రల్లో వండటానికి నూనె అవసరం తక్కువ. పోషక విలువలను కాపాడే సామర్థ్యం ఈ పాత్రలకు ఉంటుంది. అందుకే ఇవి ఎంతో మంచివని ఎన్‌ఐఎన్ వివరించింది. మట్టి పాత్రల్లో వండటం వల్ల వేడి అన్ని వైపులకు సమానంగా పంపిణీ అవుతుందని, దీంతో ఆహారంలోని పోషక విలువలను కాపాడుకోవచ్చునని వివరించింది.
#NonStick pans #danger: India's top nutrition institute declares mud pots best utensil for cooking, warns about non-stick pans - The Economic Times https://t.co/Wh89JjTv7y
— Yogesh Naik (@yogesa) May 11, 2024
నాన్ స్టిక్ కోటింగ్ వేసిన ప్యాన్ లతో..
ఇదే సమయంలో నాన్ స్టిక్ కోటింగ్ వేసిన ప్యాన్ లతో ప్రమాదమేనని వెల్లడించింది. ఈ ప్యాన్ లలో టెఫ్లాన్ ఉపయోగిస్తామని, దీన్ని 2013 నుంచి వాడటం మానేసినట్టు గుర్తుచేసింది. నాన్ స్టిక్ ప్యాన్ ను మితిమీరి వేడి చేయడం ప్రమాదకరమేనని వివరించింది. అధిక వేడితో నాన్ స్టిక్ కోటింగ్ ముక్కలైపోయి, హానికరమైన పదార్థాలను విడుదల చేయవచ్చునని తెలిపింది. వీటివల్ల ఊపిరితిత్తులు దెబ్బతినవచ్చునని, ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయని వివరించింది.