యూపీ నోయిడాలోని డన్ కౌర్ టౌన్ దగ్గరి ఓ గ్రామంలో ఐరన్ మ్యాన్ సూట్‌ను పోలిన ఓ బెలూన్ (Iron Man Balloon) నోయిడా ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. అది ఏలియన్‌లాగా గాల్లోంచి నేలపై దిగటంతో జనం బిక్కచచ్చిపోయారు. గ్రేటర్ నోయిడాలోని దాన్‌కౌర్ ప్రాంతంలో ( Greater Noida's Dankaur) నిన్న ఉదయం ఓ వింత ఆకారం గాల్లో ఎగురుతూ కనిపించింది. కొంతసేపటి తర్వాత ఓ కాలువలోకి దిగి, అక్కడే కొద్దిసేపు కదులుతూ కనిపింది. దాని చూసిన జనం అది అచ్చం ఏలియన్ లాగానే ( Like Alien in the Sky) ఉందంటూ.. కాదు, కాదు ఏలియనే అంటూ భయభ్రాంతులకు గురయ్యారు.
ఆ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దాన్‌కౌర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అనిల్‌కుమార్ పాండే అక్కడికి చేరుకున్నాక అసలు విషయం బయటపడింది. అది ఏలియన్ కాదని.. ఐరన్ మ్యాన్‌ను పోలి ఉన్న బెలూన్ అని ఆయన స్థానికులకు వివరించారు. బెలూన్ గాల్లోకి ఎగరటానికి ఆధారమైన గ్యాస్ తగ్గుతుండటంతో అది నేలపై పడిందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఎవరో వ్యక్తులు ‘ఐరన్ మ్యాన్’ మూవీలోని ఈ క్యారక్టర్ రూపంలో దీన్ని మలిచి గాలి నింపి వదిలి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. క్రమంగా ఇందులోని గాలి తగ్గిపోతూ ఈ బెలూన్…. కింద కాలువ దగ్గరి పొదల్లో పడిపోయింది. ఈ తమాషా పని ఎవరిదంటూ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.