రిలయన్స్ జియో తన ‘ఎయిర్ ఫైబర్’ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ‘జియో ఫ్రీడమ్ ఆఫర్’ పేరిట ఇన్‌స్టలేషన్ ఛార్జీలు లేకుండానే కొత్త జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్‌ను అందించనున్నట్టు ప్రకటించింది. కొత్త కనెక్షన్‌ను పొందాలనుకునే నూతన యూజర్లకు ఈ ఆఫర్ ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఇది పరిమిత కాల ఆఫర్. ఇప్పటికే కనెక్షన్ తీసుకున్న వినియోగదారులతో పాటు కొత్తగా కనెక్షన్‌ను బుక్ చేసుకునేవారికి ఈ ఆఫర్ వస్తుందని పేర్కొంది. . గుడ్ న్యూస్, ఎలక్ట్రానిక్ వస్తువులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 15 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించిన కేంద్ర ఆర్థికమంత్రి
‘ఫ్రీడమ్ ఎయిర్ ఫైబర్’ ఆఫర్ కింద కొత్త యూజర్లకు ఏకంగా 30 శాతం డిస్కౌంట్ లభిస్తుందని జియో తెలిపింది. జులై 26 నుంచి ఆగస్టు 15 మధ్య కొత్తగా చేరే కస్టమర్లకు ఇన్‌స్టలేషన్ ఛార్జీలు రూ.1000 మాఫీ అవుతాయని వివరించింది. 3 నెలలు, 6 నెలలు, 12 నెలల 5జీ, 5జీ ప్లస్ ప్లాన్లను ఎంచుకునే నూతన వినియోగదారులు అందరికీ జీరో ఇన్‌స్టలేషన్ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది.
జియో ఫ్రీడమ్ ఆఫర్ 3 నెలల ఆల్ ఇన్ వన్ ప్లాన్‌కు ప్రస్తుతం రూ. 3,121 చెల్లించాల్సి వస్తోంది. ఇందులోనే రూ.1000 ఇన్‌స్టలేషన్ ఛార్జీలు కలిపి ఉంటాయి. ఇవి మాఫీ అవుతాయి కాబట్టి కొత్త యూజర్లు రూ. 2,121లకే జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్ పొందవచ్చు.