Happy birthday Kanō Jigorō Photo-Google)

ప్రముఖ విద్యావేత్త జిగోరో కానో జన్మదినం నేడు. జిగోరో కానో 161వ జన్మదినం సందర్భంగా గూగుల్ తన సెర్చ్ ఇంజిన్ లో డూడుల్ తో నివాళి అర్పించింది.లాస్ ఏంజెల్స్, CA-ఆధారిత కళాకారిణి సింథియా యువాన్ చెంగ్ ఈ డూడుల్ ను చిత్రీకరించింది. ఈయనను ఫాదర్ ఆఫ్ జూడో గా పిలుస్తారు. జూడో కళను ప్రపంచానికి అందించిన గొప్ప విద్యావేత్తగా జిగోరో ప్రసిద్ధిపొందారు. క్రీడల్లో కూడా న్యాయం, మర్యాద, భద్రత, వినయం వంటి సూత్రాలు ఉండాలనే ఉద్దేశంలో ఈ క్రీడను ఆయన వెలుగులోకి తీసుకువచ్చాడు.

1860లో మికేజ్‌లో (ప్రస్తుతం కోబ్‌లో భాగం) జన్మించిన కానో తన 11వ ఏట తన తండ్రితో కలిసి టోక్యోకు వెళ్లాడు. పాఠశాలలో అతను చైల్డ్ ప్రాడిజీగా పేరుపొందినప్పటికీ, అతను తరచూ కష్టాలను ఎదుర్కొన్నాడు.బలం పెంచుకోవడం కోసం యుద్ద కళను అధ్యయనం చేశాడు. 1909లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC)లో మొదటి ఆసియా సభ్యుడు అయ్యాడు. 1960లో, IOC జూడోను అధికారిక ఒలింపిక్ క్రీడగా ఆమోదించింది.1893లో మహిళలను క్రీడలోకి ఆహ్వానించారు.