Bengaluru, Jan 27: అయోధ్య బాలరాముడి (రామ్ లల్లా) (Ayodhya Ram Lalla) విగ్రహాన్ని రూపొందించేందుకు వందల కోట్ల ఏండ్ల నాటి కృష్ణ శిలను(నల్ల రాయి) గుర్తించినందుకు శ్రీనివాస్ నటరాజ్ (Srinivas Nataraj) అనే చిన్న కాంట్రాక్టర్ కు చివరకు ఆవేదనే మిగిలింది. ఒక ప్రైవేట్ స్థలంలో అక్రమంగా మైనింగ్ చేశారని ఆరోపిస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ మైనింగ్, భూగర్భ శాఖ ఆయనకు రూ.80 వేల జరిమానా విధించింది. జరిమానాను చెల్లించేందుకు శ్రీనివాస్ తన భార్య బంగారం నగలను తాకట్టు పెట్టాల్సి వచ్చిందని స్థానిక మీడియా పేర్కొన్నది.
Karnataka: Contractor who found the stone for sculpting Ram Lalla idol by Arun Yogiraj was fined Rs 80,000 for alleged illegal quarrying at private propertyhttps://t.co/AO9MuIXQpw
— OpIndia.com (@OpIndia_com) January 25, 2024
ఏమైందంటే??
మైసూర్ సమీపంలోని గుజ్జెగౌదనపుర అనే గ్రామానికి చెందిన రామదాస్ అనే రైతుకు చెందిన పొలంలో రాళ్లను తొలగించేందుకు శ్రీనివాస్ కు ఒక కాంట్రాక్టు వచ్చింది. ఈ క్రమంలో ఒక పెద్ద రాయిని మూడు భాగాలుగా చేశామని, అందులో ఒకదాన్ని అయోధ్య రామ్ లల్లా విగ్రహ రూపకల్పన కోసం ఎంచుకొన్నారని శ్రీనివాస్ నటరాజ్ తెలిపారు. చివరకు అక్రమంగా మైనింగ్ చేశారని ఆరోపిస్తూ ప్రభుత్వం తనపై జరిమానా విధించిందని వాపోయారు.