Thiruvanantapuram, September 16: కేరళ - తమిళనాడు రాష్ట్రల సరిహద్దు(Kerala-Tamil Nadu border)లో కుంబుమెట్టు(Cumbummettu) పోలీస్ స్టేషన్ ఉంది. కేరళకు చెందిన ఈ పోలీస్ స్టేషన్.. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది. అందువల్ల ఈ స్టేషన్‌కు కోతుల బెడద ఎక్కువగా ఉంది. వానరాలను పోలీస్ అధికారులు పదే పదే తరిమి కొట్టాల్సిన పరిస్థితి. ఎన్నిసార్లు వాటిని బెదరగొట్టినా.. అవి మళ్లీ మళ్లీ స్టేషన్‌ను చుట్టు ముట్టేవి. దీంతో అక్కడి అధికారులు తమను తాము రక్షించుకోవడానికి వినూత్న ఆలోచన చేశారు.
కదులుతున్న రైలులో చోరీకి యత్నం.. దొంగకు చుక్కలు చూయించిన ప్రయాణికుడు.. ఏం చేశాడంటే?
చైనాలో తయారైన రబ్బరు పాములను పెద్ద మొత్తంలో కొనుగోలు చేశారు. అచ్చం నిజమైన పాముల్లా కనిపించే ఆ బొమ్మ పాముల(China-made snakes)ను పోలీస్ స్టేషన్ చుట్టూ ఉండే చెట్లపై సెట్ చేశారు. దీంతో ఆ స్టేషన్‌కు కోతుల బెడద తప్పింది.