Newdelhi, May 13: ప్యాకేజ్డ్ పదార్థాలపై (Packaged Food) ఉండే ఫుడ్ లేబుళ్లలో పేర్కొన్న అన్ని విషయాలను నిజమని అనుకోవద్దని, ఆ వివరాలు తప్పు దోవ పట్టించే అవకాశం ఉన్నదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) (ICMR) వినియోగదారులను హెచ్చరించింది. ‘కఠిన ప్రమాణాలు అమల్లో ఉన్నా లేబుళ్లపై ఉన్న సమాచారం తప్పు దోవ పట్టించవచ్చు’ అని తెలిపింది. వాటిపై ఉన్న సమాచారాన్ని జాగ్రత్తగా చదివి ఆరోగ్యకరమైన వాటిని ఎంపిక చేసుకోవాలని సూచించింది. ఇటీవల నిర్వహించిన పలు రివ్యూ మీటింగ్స్ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.
Label claims on packaged food could be incorrect incomplete: ICMR https://t.co/pKXynB9iHX via @economictimes
— Anish Nanda (@anish_nanda) May 12, 2024
ఐసీఎంఆర్ అలర్ట్ మెసేజ్ ఇలా..
- పండ్ల రసాలలో కేవలం 10 శాతం మాత్రమే పండ్ల గుజ్జు ఉండొచ్చు.
- ‘నేచురల్’ ఫుడ్ ప్రొడక్ట్ అంటే ఎలాంటి రంగులు, ఫ్లేవర్స్ కలపకుండా, తక్కువ ప్రాసెసింగ్ చేసిన ఆహారం అని అర్థం.
- కానీ తయారీదారులు రెండు, మూడు సహజసిద్ధమైన పదార్థాలను వాడినా తమది నేచురల్ ఫుడ్ అని లేబుల్‌పై ముద్రిస్తున్నారు. నిజానికి అది నేచురల్ ఫుడ్ కాదు.