ఉపాయం ఉన్నోడు, ఉపవాసం ఉండడు అని తెలుగులో ఓ సామెత ఉంది. అలాంటి సామెతలు కొంతమందికి సరిగ్గా సరిపోతాయనిపిస్తుంది. లాక్డౌన్ కారణంగా ఎన్నో రంగాలు దెబ్బతింటే కొంత మంది దానినే ఓ అవకాశంగా మలుచుకొని మంచి వ్యాపారం చేస్తున్నారు. ఉదాహరణకు ఇప్పుడు మాస్కుల అమ్మకం కూడా మంచి వ్యాపారమే. ఇప్పటివరకు బ్రాండెడ్ మాస్కులు, కపుల్ మాస్కులు, పట్టు మాస్కులు, బంగారు మాస్కులు చూశాం, విన్నాం. ఇప్పుడు దీపావళి వచ్చింది కాబట్టి దీపాల మాస్కులు కూడా వచ్చేశాయి.
అవునూ, ఇప్పుడు కొంతమంది ఆన్ లైన్ లో ఎల్ఈడీ మాస్కులు అమ్ముతున్నారు. ఆ మాస్కులో LED దీపం అమర్చబడి ఉంది, దానికే చిన్న స్విచ్ లాంటిది ఉంది, బ్యాటరీతో పనిచేస్తుంది. ఆ స్విచ్ గనక వేస్తే మాస్క్ లోని దీపం వెలుగుతుంది, అలాగే నొక్కుతూ ఉంటే లైట్ రంగులు కూడా మారుతుంది. ఒక అమ్మాయి అలాంటి LED మాస్క్ వేసుకునే వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు కూడా చూడండి ఆ వీడియో.
Diwali 2020 Special Face Mask With LED Light Color Variation:
ఒక్కసారి ఊహించుకోండి, మీరు గనక, ఈ ఎల్ఈడీ మాస్క్ గనక ధరిస్తే, ముఖం కడుక్కోకపోయినా, ఎలాంటి ఫెయిర్ నెస్ క్రీములు రాయకపోయినా మీ మొఖం మిలమిల తళతళ జిల్ జిల్ జిగేల్ అన్నట్లుగా మెరిసిపోతుంది. అంతేకాదు ఏ రంగులో కావాలంటే, ఆ రంగులో ఎరుపు, పసుపు, తెలుపు, నీలం ఇలా, జస్ట్ స్విచ్ వేయడమే.
పండగ వస్తే కొత్త బట్టలు ఎవరైనా వేసుకుంటారు. దీపావళికి దీపాలు ఎవరైనా వెలిగిస్తారు, పటాకులు ఎవరైనా కాలుస్తారు. మనిషి అన్నాక కూసంతా కళాపోషణ ఉండాలా.. అంటారు కాబట్టి మీరూ LED మాస్కులు ధరించండి స్టైల్ బేబీ స్టైల్ అని బెదరగొట్టండి, సారీ.. అదరగొట్టండి. అన్నటూ మాస్కులే కాదు, మీకు గడ్డం ఉంటే మీ గడ్డానికి లైట్స్ ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే. 'యుద్ధంలో ఖడ్గం.. మగవారికి ఎల్ఈడీ గడ్డం ఎంతో అవసరం' చదవండి.