Aadhar Ganesh (Photo Credits: ANI)

Ranchi, September 2: మనుషులకు ఉన్నట్లే..  దేవుళ్లకు కూడా ఆధార్‌ ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు జార్ఖండ్‌లోని జెంషెడ్‌పూర్‌కు చెందిన కొందరు యువకులు.. అందుకు వినాయక చవితి ఉత్సవాలను వేదికగా చేసుకున్నారు. గణేషుడి పేరుపై ఆధార్‌ కార్డు సృష్టించేసి పందిరి నిర్మించారు. అక్కడికి వచ్చి పోయే భక్తులు ఆసక్తితో ఆధార్‌ కార్డులోని వివరాలను చదువుతూ, సెల్ఫీలు దిగుతూ ముచ్చట పడుతున్నారు.

ఓ స్త్రీ రేపు రా.. మన దగ్గర కాదు.. ఇప్పుడు మెక్సికో లో..

ఆధార్‌ కార్డు ప్రకారం.. వినాయకుడి అడ్రస్‌ కైలాసంగా పేర్కొన్నారు. ఫోటో స్థానంలోనే గణేషుడిని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు. ఇంకా అడ్రస్ ప్రకారం.. శ్రీ గ‌ణేశ్ S/o మ‌హాదేవ్‌, కైలాస్ ప‌ర‍్వత శిఖరం, మాన‌స స‌రోవ‌రం స‌ర‌స్సు ద‌గ్గర, పిన్‌కోడ్ 000001 అని రాసి ఉంది. ఇక డేట్ ఆఫ్‌ బ‌ర్త్ 01/01/600CEగా పేర్కొన్నారు.