Haunted House In Mexico

Mexico City, September 2: కొన్నేండ్ల కిందట తెలుగునాట కొన్ని ప్రాంతాల్లో ‘ఓ స్త్రీ రేపు రా’ (O stree repu raa) అనే రాతలు ఇళ్ల గోడల మీద కనిపించేవి. స్త్రీ రూపంలో ఒక దెయ్యం (Ghost) ఇంటింటికీ తిరుగుతుందనే ప్రచారం కారణంగా, ఆ దెయ్యం నుంచి తప్పించుకోవడానికి ఇళ్ల గోడల మీద అలా రాసేవారు. సరిగ్గా.. ఇప్పుడు మెక్సికోలోని (Mexico) కోకోయోక్‌ పట్టణంలో అలాంటి ఘటనలే జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే, కోకోయోక్‌ పట్టణం, ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ‘నహువా’ తెగకు చెందిన ప్రజలు ఉంటుంటారు.

యువతిని బెడ్ రూంలోకి తీసుకెళ్లాడు, పని కోసం బట్టలు విప్పగానే అది చూసి షాక్, మిస్టరీ కేసును చేధించిన ఎంపీ పోలీసులు

వారికి అతీంద్రియ శక్తులపైన, క్షుద్రప్రయోగాలపైన నమ్మకాలు ఎక్కువ. కొద్దిరోజుల కిందట రాత్రివేళల్లో వింత వింత శబ్దాలు (Abnormal sounds) విన్నట్లు స్థానికులు చెప్పుకోవడం మొదలైంది. మెల్లగా ఈ ప్రచారం ఊరంతా వ్యాపించింది. ఇది దెయ్యాల పనే అయి ఉంటుందని కొందరు వృద్ధులు చెప్పడంతో జనాల్లో భయాందోళనలు (Fears) మొదలయ్యాయి. ఊళ్లో తిరిగే దెయ్యం ఇంట్లో చొరబడకుండా ఉండటానికి ఊళ్లోని ప్రతి ఇంటికీ వీధి తలుపులపై శిలువ గుర్తులు వేయించుకున్నారు. ఇలా చేస్తే, దెయ్యం తమ ఇండ్లల్లోకి రాబోదని నమ్ముతున్నారు.