Representational Image | Couple (Photo Credits: Pixabay)

నందిగామ, మార్చి 6 : సహజీవనం పేరుతో.. కొన్ని జంటలు చేయరాని పనులు చేస్తున్నారు. ఆఖరికి అవి.. ఒకరినొకరు చంపుకునేందుకు దారి తీస్తున్నాయి. సహజీవనంతో కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఈ పోకడ.. క్రమంగా మన దేశానికీ వ్యాపించి.. ఒక వ్యసనంలా తయారైంది. ఒక మహిళ ఇద్దరు పురుషులతో సహజీవనం చేస్తోంది. తనతో కాకుండా మరొక వ్యక్తితో చనువుగా ఉండటాన్ని చూడలేకపోయిన విజయ్.. అతడిని హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గుత్తి విజయ్, ఉష అనే మహిళ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ఇద్దరు కలిసి శారీరకంగా దగ్గరయ్యారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. కానీ అంతలోనే విజయ్ తో ఉంటుండగానే.. ఉషకు వరి అప్పాజీ అనే మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడితోనూ శారీరక సంబంధం ఏర్పడటంతో.. విజయ్, ఉష, అప్పాజీ లు ఒకే ఇంట్లో ఉంటున్నారు.

యుక్రెయిన్‌ లో మరో పెను ప్రమాదం, రష్యా దాడుల్లో యూరప్ అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం, ఏ క్షణమైనా ముప్పువాటిల్లే అవకాశం

ముగ్గురూ మూడ్రోజుల క్రితం కృష్ణాజిల్లా నందిగామలో ఉన్న ఓ హోటల్ లో పనిచేసేందుకు వచ్చారు. అయితే ఉష తన కొత్త ప్రియుడు అప్పాజీతో ఓ గదిలో శృంగారం చేస్తూ కనిపించింది. ఈ విషయం విజయ్ గమనించాడు. అది చూడలేక.. నిద్రపోతున్న సమయంలో అప్పాజీని పీకకోసి హతమార్చాడు. అడ్డొచ్చిన ఉషకు కూడా తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.