 
                                                                 Newdelhi, Oct 3: కేరళలోని (Kerala) కోజికోడ్ బీచ్ కు కొట్టుకొచ్చిన ఓ బ్లూ వేల్ (నీలి తిమింగలం) (Blue Whale) కళేబరాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. దాని పొడవు 15 మీటర్లు (దాదాపు 50 అడుగులు) ఉంది. స్థానిక జాలర్ల ద్వారా సమాచారం అందుకున్నఆరోగ్యాధికారి ప్రమోద్ వెంటనే బీచ్ కు చేరుకుని తిమింగలం కళేబరాన్నిపరిశీలించారు. దాని మరణానికి కారణం తెలుసుకునేందుకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రొటోకాల్ ప్రకారం దానిని అక్కడే పెద్దగొయ్యి పాతిపెడతామని చెప్పారు.
View this post on Instagram
దయచేసి ఎవరూ ఆ కళేబరం వద్దకు వెళ్లొద్దని, అది పేలిపోయి గాయాలపాలయ్యే అవకాశం ఉందని ఓ ఇన్ స్టా యూజర్ హెచ్చరించారు. సాధారణంగా పెద్ద తిమింగలాల కళేబరాల్లో వాయువులు ఏర్పడి ఒక్కోసారి పేలిపోతుంటాయి అని నిపుణులు చెబుతున్నారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
