Agra, Sep 23: ప్రేమకు చిహ్నం, ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా పేరొంది ఏటా పర్యాటకులను విపరీతంగా ఆకర్షించే ఆగ్రాలోని (Agra) తాజ్ మహల్ (Cracks Appear on Walls of Taj Mahal) లోపభూయిష్టమైన నిర్వహణతో నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఫలితంగా ఈ పాలరాతి కట్టడంలోని గోడలు, ఫ్లోరింగ్ పలు చోట్ల దెబ్బతినడమే కాక, పగుళ్లు కూడా దర్శనమిస్తున్నాయి. ఇటీవల ఆగ్రాలో కురిసిన భారీ వర్షం కారణంగా ఇవి మరింత పెరిగినట్టు భావిస్తున్నారు.గతంలో ప్రధాన గోపురం చుట్టూ ఉన్న తలుపులపై అరబిక్ లో ఖురాన్ శ్లోకాలు ఉండేవి. ఇప్పుడవి చెరిగిపోయాయి. గోడలలో పొదిగిన విలువైన రాళ్లు కూడా అవసాన దశకు చేరుకుంటున్నాయని టూరిస్ట్ గైడ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి షకీల్ చౌహాన్ తెలిపారు.
Cracks and damage appear on the walls & floors of Taj Mahal after heavy rainfall in Agra#latest #vanakkammalaysia #Cracks #damage #appear #walls #floors #TajMahal #heavy #rainfall #Agra #tredingnewsmalaysia #malaysiatamilnews #fyp #vmnews #foryoupage pic.twitter.com/u24H5Gkdrn
— Vanakkam Malaysia (@vmnews) September 22, 2024
గుమ్మటం నుంచి నీరు
ఇటీవల కురిసిన భారీ వర్షానికి తాజ్ మహల్ ప్రధాన గుమ్మటం నుంచి నీరు కారడమే కాక, కట్టడం ముందున్న తోట నీట మునిగింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.